Menu Close

Union Budget 2022 in Telugu – ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!


Union Budget 2022 in Telugu – ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌-2022 ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా భారత్‌ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్‌-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా లభించనుండగా.. కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

కేంద్ర బడ్జెట్‌-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్‌, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా మారబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతంకు తగ్గించారు. భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే..

చౌకగా లభించేవి
1.బట్టలు
2.రత్నాలు,వజ్రాలు అనుకరణ ఆభరణాలు
3.మొబైల్ ఫోన్లు
4.మొబైల్ ఫోన్ ఛార్జర్లు
5.పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన
6.రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
7.మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు
8.స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఏడాదిపాటు వర్తించనుంది.

ఖరీదైనవి
1.అన్ని దిగుమతి వస్తువులు
2.గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి.
3.క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Telugu News

Subscribe for latest updates

Loading