Udayinchina Suryudinadiga Lyrics in Telugu – Kalusukovalani – ఉదయించిన సూర్యుడినడిగా లిరిక్స్
హే ఉదయించిన సూర్యుడినడిగా… కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా… నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా… చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా… నువ్వెక్కడని
చిక్కవేహే ఓ చెలి… నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు… అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి… చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడు… నే మరువలేని తీపి గురుతులే
మనసు అంత నీ రూపం… నా ప్రాణమంత నీ కోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు… అలసిపోయె పాపం
నీ జాడ తెలిసి మరునిమిషం… అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం… ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగునా నువ్వే నువ్వే… నన్ను తాకేనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే… నన్ను చేరవే
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె… గుండె చప్పుడికి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే… నన్ను చేరవే
హే ఉదయించిన సూర్యుడినడిగా… కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా… నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా… చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా… నువ్వెక్కడని
ఏమి మాయవో ఎమో గాని… నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది… నిన్ను రమ్మని
హోయ్ నువు ఎక్కడున్నావో గాని… నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేక నే లేను… అని నీకు తెలుపని
హే ఉదయించిన సూర్యుడినడిగా… కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా… నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా… చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా… నువ్వెక్కడని
చిక్కవేహే ఓ చెలి… నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు… అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి… చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడు… నే మరువలేని తీపి గురుతులే
హో హే హో హే… హో హే హో హే.. ..
Udayinchina Suryudinadiga Lyrics in Telugu – Kalusukovalani – ఉదయించిన సూర్యుడినడిగా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.