ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే… రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగా… నీ వెనకాలే రాని సాయంగా
ఆ వంక ఈ వంక… హో హ్హో, తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా… హో హ్హో, ఇంతేగా నీ రెక్కా
ఎగిరేను ఎప్పటికైనా… ఆకాశం దాకా
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే… రావే నా వంకా
దోసిట్లో ఒక్కో చుక్క… పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోకచిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా… నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా… చినుకులుగా
సూర్యుడు ఏడి, నీతో ఆడి… చందమామ అయిపోయాడుగా
ఓ ఓ ఓఓ… తూనీగ తూనీగా
ఎందాక పరిగెడతావే… రావే నా వంకా
ఆ కొంగలు ఎగిరి ఎగిరి… సాయంత్రం గూటికి మళ్ళి
తిరిగొచ్చే దారిని… ఎపుడూ మరిచిపోవేలా
ఓసారటువైపెలుతుంది… మల్లి ఇటు వైపొస్తుంది
ఈ రైలుకి సొంతూరు ఎదో గుర్తు రాదేలా
కూ కూ బండి… మా ఊరుంది
ఉండి పోవే మాతోపాటుగా
తూనీగ తూనీగా ఎందాక పరిగెడతావే… రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగా… నీ వెనకాలే రాని సాయంగా
ఆ వంక ఈ వంక… హో హ్హో, తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా… హో హ్హో, ఇంతేగా నీ రెక్కా
ఎగిరేను ఎప్పటికైనా… ఆకాశం దాకా