Menu Close

Top 7 Indian States with Most Hindu Temples – అత్యధికంగా హిందూ దేవాలయాలు ఉన్న రాష్ట్రాలు


మన భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ దేవాలయాలు ఉన్న రాష్ట్రాలు – Top 7 Indian States with Most Hindu Temples

Angkor Wat Sunrise

రాజస్థాన్: రాజస్థాన్ ఏడవ స్థానంలో ఉంది. ఇక్కడ వివిధ దేవుళ్లకు చెందిన ఆలయాలు సుమారు 39,000 వరకు ఉన్నాయి. వీటిల్లో ప్రముఖమైనవి పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయం, ఉదయపూర్‌లోని ఎక్లింగ్‌జీ ఆలయం, జగత్‌లోని అంబికా మాత ఆలయం, దేశ్‌నోక్‌లోని కర్ణి మాత మందిర్, సలాసర్‌లోని సలాసర్ బాలాజీ ఆలయం, కరౌలిలోని మెహందీపూర్ బాలాజీ ఆలయం, రాణి వద్ద సాయి ధామ్, జైపూర్‌లోని బిర్లా మందిర్, మోతీ దుంగారి ఆలయం, ఖనియా-బాలాజీలోని గల్తాజీ ఆలయం.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం
ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram WhatsApp

ఆంధ్రప్రదేశ్‌: భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 47,000 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది, ప్రపంచ ప్రసిద్ధిగాంచినది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీకాళహస్తీశ్వరాలయం, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున, కాణిపాక వరసిద్ధి వినాయక, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, నెల్లూరు రంగనాథ దేవాలయం మొదలైనవి ప్రసిద్ధి చెందినవి.

ఇలాంటి ఇంటరెస్టింగ్ కంటెంట్ కోసం ఇప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

గుజరాత్‌: అత్యధిక దేవాలయాలున్న ఐదవ రాష్ట్రం గుజరాత్. ఇక్కడ దాదాపు 50,000 దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రముఖమైనవి ద్వారకాధీశ దేవాలయం, సోమనాథ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, భాగవత కొండ, అంబాజీ ఆలయం, అక్షరధామ్ ఆలయం, దేవరేశ్వర్ మహాదేవ ఆలయం, రుక్మణి దేవి, ద్వారక, రామచోట్రై ఆలయం ఠాగూర్, కేత, శ్రీ స్వామినారాయణ ఆలయం కలుపూర్, అహ్మదాబాద్ మొదలైనవి ప్రసిద్ధి చెందినవి.

పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 53,500 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం, కోల్‌కతా, కాళీఘాట్ కాళీ దేవాలయం కోల్‌కతా, బేలూర్ మఠం, హౌరా, ఇస్కాన్ దేవాలయం. మాయాపూర్, నందికేశ్వరి ఆలయం సైంథియా, మదన్మోహన్ దేవాలయం, బిష్ణుపూర్, శ్రీ శ్రీ మాతృ మందిరం జయరాంబటి, తారకనాథ్ ఆలయం తారకేశ్వర్, డార్జిలింగ్ శాంతి పగోడా డార్జిలింగ్, బిర్లా దేవాలయం కోల్‌కతా, పరస్నాథ్ మందిరం కోల్‌కతా, మహాకాల్ దేవాలయం డార్జిలింగ్ వంటి అనేక ప్రసిద్ధ ప్రదేశాలు, దేవాలయాలు ఉన్నాయి.

కర్ణాటక: కర్ణాటక మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు 61,000 దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీరంగపట్నం రంగనాథ స్వామి, శృంగేరి శారదా పీఠం, గోకర్ణం మహాబలేశ్వర్ ఆలయం మొదలైనవి ఉన్నాయి.

మహారాష్ట్ర: అత్యధిక దేవాలయాల జాబితాలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 77,000 దేవాలయాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ముంబా దేవి ఆలయం, అష్ట వినాయక క్షేత్రాలు, కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి గుడి, షిరిడీ సాయినాథ్ గుడి, త్రయంబకేశ్వరం, భీమశంకర జ్యోతిర్లింగం, మోరేశ్వర్, శని సింగనాపూర్, గిరిజా మాత, కైలాస దేవాలయం, నాగేశ్వర జ్యోతిర్లింగం, పులేశ్వర్, అమృత్‌సర్, శ్రీ మయూరేశ్వర్ మొదలైనవి ఉన్నాయి.

తమిళనాడు: భారతదేశంలో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ దాదాపు 79,000 దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడు హిందూ మతంతో సహా అన్ని మతాలకు నిలయం. ఇక్కడి ప్రసిద్ధ ఆలయాల్లో మీనాక్షి అమ్మన్ కోవెల మదురై, ఆది కుంబేశ్వరర్ కుంభకోణం, బృహదీశ్వరాలయం తంజావూరు, శ్రీ రంగనాథస్వామి దేవాలయం శ్రీరంగం, శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం మన్నార్గుడి, జంబుకేశ్వర ఆలయం, తిరువానైకావల్, కంచి కైలాసనాథర్ ఆలయం కాంచీపురం, ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం, రామనాథస్వామి దేవాలయం రామేశ్వరం, మయూరనాథస్వామి ఆలయం మైలాడుతురై, కపాలీశ్వర ఆలయం చెన్నై, ఏకశిలా రాతి దేవాలయాలు మహాబలిపురం, పాపనాశం దేవాలయం తిరునెల్వేలి సహా ఇక్కడ దేవాలయాలు వేల సంవత్సరాల నాటివి.

States in India with Most Hindu Temples
Top 7 States Famous for Hindu Temples in India
Where to Find Most Hindu Temples in India
Popular Indian States with Highest Number of Temples
Top Indian States with Rich Temple Heritage

Like and Share
+1
0
+1
1
+1
0
Share with your friends & family
Posted in Hinduism
Loading poll ...

Subscribe for latest updates

Loading