Menu Close

Top 50 Trivikram Srinivas Dialogues – త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్

Top 50 Trivikram Srinivas Dialogues

యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం.

మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి
సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.

Top 50 Trivikram Srinivas Dialogues

ఒక మనిషికి ఉంటే కోపం,
అదే కోపం ఒక గుంపు కి ఉంటే ఉద్యమం.

ఈ వయసులో నాకు కావాల్సింది నిజాలు, అబ్బద్దాలు కావు జ్ఞాపకాలు.

బాధలో ఉన్నవాడ్ని ఎలా ఉన్నావని అడగడం అమాయకత్వం
బాగున్నవాణ్ణి ఎలా ఉన్నావని అడగడం అనవసరం.

ఒక్కోసారి నీతో ఏదయినా మాట్లాడలనిపిస్తుంది
ఒక్కోసారి ఏది మాట్లాడలన్న భయం వేస్తోంది..
ఒక్కోసారి ఏడిపిస్తావ్ ఒక్కోసారి నవ్విస్తావ్..
నన్నెందుకిలా హింసిస్తావ్…

మనం కోరుకున్న వాళ్ళతో ఉండొచ్చు,
మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు,
అసలే కోరిక లేకుండా ఉండొచ్చు.

ఆకలేస్తే నేల వైపు
దాహం వేస్తే ఆకాశం వైపు చూసే జనాలున్నారని తెలుసా.

బెదిరింపుకి భాష అవసరం లేదు.

అందంగా ఉండటం అంటే మనకు నచ్చేలా ఉండటం కానీ
ఎదుటివాళ్లకు నచ్చేలా ఉండటం కాదు.

దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మీ…
కళ్ళు ఉన్నాయని సంతోషించే లోపే
కన్నీళ్లు ఉన్నాయని గుర్తు చేస్తాడు.

వాడి కోపం ప్రళయం,
వాడి ప్రేమ సముద్రం,
వాడి జాలి వర్షం.

నెలకొకసారి జీతం ఇస్తున్నారు కదా అని
గంటకొకసారి తిడితే భరించే ఓపిక లేదు.

ఆడవాళ్లు అంతే ప్రేమించేటప్పుడు పెద్దవాళ్ళు గుర్తురారు
పెళ్లి చేసుకొనేటప్పుడు ప్రేమించిన వాడు గుర్తుకురాడు.

ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు కానీ
పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి.

ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు,
పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు.

ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తారు,
పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు.

ఒక మనిషి ని మనం ప్రేమిస్తే
వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మనం క్షమించగలిగేలా ఉండాలి,
లేదా మనం ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి.

నిజం చెప్పకపోవటం అబద్దం
అబద్దాన్నీ నిజం చెయ్యాలి అనుకోవటం మోసం.

లాజిక్ లు ఎవరు నమ్మరు..
అందరికీ మ్యాజిక్ లే కావాలి.
అందుకే మన దేశం లో శాస్త్రవేత్తల కన్నా బాబా లే ఫేమస్.

మనకి తెల్సిన పని ఫ్రీ గా చేయకూడదు,
మనకి రాని పని చేయకూడదు.

నేను పిడికిలి బిగిస్తే గాలి కూడా వూపిరాడక చస్తుంది.

క్లాస్ లో ఉనప్పుడు ఎవడైనా సమాధానం చెప్తాడు
కాని పరీక్షలో రాసేవాడే టాపరౌతాడు.

ఆశ కాన్సర్ ఉన్నోడిని కూడా బ్రతికిస్తుంది.
భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది.

Greatest battles are with closest people.
గొప్ప యుద్ధాలన్నీ ‘నా’ అనుకున్నవాళ్ళతోనే.

దేవుడికైనా దక్షిణ కావాలి. రాజుకైనా రక్షణ కావాలి.
చెప్పే వ్యక్తిని బట్టి విషయం విలువే మారిపోతుంది.
ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావు కేక ఒక్కటే శబ్దం.
యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కు లేదు.

యుద్ధంలో గెలిచేవాడికన్నా
అసలు యుద్ధమే రాకుండా ఆపేవాడు గొప్పవాడు.

యాక్సిడెంట్ అంటే బస్సో కారో రోడ్డు మీద పడిపోవడం కాదు.
ఒక కుటుంబం రోడ్డు మీద పడడం.

డబ్బు సంపాదించడం చేతకానివాడికి ఖర్చు పెట్టే హక్కు లేదు.
చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు.

మనం పది మెట్లు ఎక్కితే
మన పిల్లలు పదకొండో మెట్టు నుంచీ మొదలవ్వాలనుకోవాలి కానీ
మళ్ళీ మొదటి మెట్టు నుంచీ ఎక్కమనడం కరెక్ట్ కాదు.

ఒక మనిషిని మనం ప్రేమిస్తే
వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మనం క్షమించగలగాలి.
లేదా మనం ప్రేమించలేదని ఒప్పుకోవాలి.

ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు.
పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైముండదు.

మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ,
ఓడి పోయినప్పుడు భుజo తట్టేవాల్లు
నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా,
ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు.

విడిపోవడం తప్పదు అన్నప్పుడు,
అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.

Top 50 Trivikram Srinivas Dialogues

Trivikram Srinivas dialogues, Trivikram Srinivas movies, famous dialogues in Telugu cinema, Trivikram’s best dialogues, Telugu movie dialogues, Trivikram Srinivas quotes, powerful dialogues in Telugu films, Trivikram’s impactful lines.

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading