Tolisaari Mimmalni Chusindi Modalu Lyrics In Telugu – Srivariki Premalekha
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా..
ప్రియానంద భోజా…
మీ శ్రీచరణాంభుజములకు… ప్రేమతో నమస్కరించి
మిము వరించి, మీ గురించి… ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ…
భయముతో, భక్తితో, అనురక్తితో… చాయంగల విన్నపములూ
సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ…
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ…
ఓ శుభ ముహూర్తాన…
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు…
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు…
ఎన్నెనెన్నొ కధలు…
జో అచ్యుతానంద… జో జో ముకుందా…
లాలి పరమానంద… రామ గోవిందా… జో జో
నిదుర పోని కనుపాపలకు… జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న… ఈడునాపలేకా
ఇన్నాళ్ళకు రాస్తున్నా… హూహు హూహు…
ప్రేమ లేఖ…
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు…
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు…
ఎన్నెనెన్నొ కధలు…
ఏ తల్లి కుమారులో తెలియదు గాని…
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు…
ఎంతటి మగధీరులో… తెలియలేదు గాని
నా మనసును దోచిన… చోరులు మీరు…
వలచి వచ్చిన వనితను… చులకన చేయక
తపులుంటె మన్నించి… ఒప్పులుగా భావించి…
చప్పున బదులివ్వండి… చప్పున బదులివ్వండీ…
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు…
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు…
ఎన్నెనెన్నొ కధలు…
తలలోన తురుముకున్న… తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే…
ఆహ్ అబ్బా..!!
సూర్యుడి చుట్టూ తిరిగే… భూమికి మల్లే
నా ఊర్పుల… నిట్టూర్పుకు జాబిలి వాడే
ఆహ్ ఆహ్…
మీ జతనే కోరుకుని… లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే… ఇచ్చినట్టు మాటిస్తే…
ఇప్పుడే బదులివ్వండి… ఇప్పుడే బదులివ్వండి
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు…
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు…
ఎన్నెనెన్నొ కధలు…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.