ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు – 30/10/2026
This week OTT Releases-Telugu Bucket-30/10/2026
ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’, సందీప్ కిషన్ మూవీ ‘సిగ్మా’, పాపులర్ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందిన ‘మీర్జాపూర్: ది మూవీ’, రాజమౌళి సమర్పించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ వంటి చిత్రాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ప్రొజెక్టర్ – 6000 లోపు అయిదిరిపోయే ప్రొజెక్టర్
అమెజాన్ ప్రైమ్ వీడియో
- డ్రైవ్: ది ప్రిటెండర్స్ (జర్మన్ మూవీ) – అక్టోబర్ 28
- కామ్రేడ్ కళ్యాణ్ (తెలుగు మూవీ) – అక్టోబర్ 30
- మీర్జాపూర్: ది మూవీ (హిందీ మూవీ) – అక్టోబర్ 30
- అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 30
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ఇక ‘మీర్జాపూర్: ది మూవీ’ యాక్షన్, గ్యాంగ్స్టర్ డ్రామాను ఇష్టపడేవారికి మంచి ఎంపిక. ఈ చిత్రం అన్కట్ వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది.

నెట్ఫ్లిక్స్
- మినిమమ్ వేజ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 26
- ద వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (డాక్యుమెంటరీ) – అక్టోబర్ 27
- దిండోరా సీజన్ 1 (హిందీ సిరీస్) – అక్టోబర్ 28
- బత్తా (తమిళ మూవీ) – అక్టోబర్ 29
- బలారా: ద బ్లడ్ ఐలాండ్ (ఫిలిపినో సిరీస్) – అక్టోబర్ 29
- డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (తెలుగు మూవీ) – అక్టోబర్ 30
- ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ) – అక్టోబర్ 30
- సిగ్మా (తమిళ మూవీ) – అక్టోబర్ 30
- అవరచన్ & సన్స్ (మలయాళ మూవీ) – అక్టోబర్ 30
- అక్క (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబర్ 30
- హౌ టు రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 30
- డెడ్ ఎండ్ జాబ్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 30
- కొలిజన్ కోర్స్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 30
- మీథే మే క్యాన్ హై (హిందీ మూవీ) – అక్టోబర్ 30
- అబ్సెస్ (అరబిక్ సిరీస్) – అక్టోబర్ 30
- ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సిరీస్) – అక్టోబర్ 30
- ఎస్సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ (ఇంగ్లీష్ షో) – అక్టోబర్ 30
ఈ వారం నెట్ఫ్లిక్స్లో ప్రధాన ఆకర్షణగా ‘సిగ్మా’, ‘అక్క’ నిలవనున్నాయి. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటించిన ‘సిగ్మా’కు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించారు. ఇక కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
హాట్స్టార్
- అబ్సెషన్: ది ఒరిజినల్ అన్కట్ వెర్షన్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 30
- లవ్ ఆల్వేస్ (తమిళ సిరీస్) – అక్టోబర్ 30
సోనీ లివ్
- ఇమ్మోర్టల్ (తమిళ మూవీ) – అక్టోబర్ 30
జీ5
- హాస్టల్ హడ్సా (హిందీ సిరీస్) – అక్టోబర్ 28
- రుద్రవనం పీఎస్ (తెలుగు వెబ్ సిరీస్) – అక్టోబర్ 30
ఆపిల్ టీవీ ప్లస్
- నాక్టర్న్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 30
మొత్తానికి ఈ వీకెండ్ తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, ఇతర భాషల కంటెంట్ కూడా ఓటీటీల్లో సందడి చేయనుంది. ముఖ్యంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’, ‘మీర్జాపూర్: ది మూవీ’, ‘సిగ్మా’, ‘అక్క’ వంటి వాటిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఈ వీకెండ్ ఇంట్లోనే ఎంజాయ్ చేయండి!