Menu Close

జీవితాన్ని సింపుల్ గా చూస్తేనే ఆనందంగా వుంటాం – The Subtle Art of Not Giving a F*ck


జీవితాన్ని సింపుల్ గా చూస్తేనే ఆనందంగా వుంటాం – The Subtle Art of Not Giving a F*ck

పుస్తకం పేరు: The Subtle Art of Not Giving a F*ck
రచయిత: మార్క్ మాన్సన్ (Mark Manson)
ప్రచురణ సంవత్సరం: 2016
ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు: 15 మిలియన్లకు పైగా
భాషలు: 50కి పైగా భాషల్లోకి అనువదించబడింది

The Subtle Art of Not Giving a Fck

ఈ పుస్తకం “బయట ప్రపంచంలో వేటిని పట్టించుకోవాలో, వేటిని వద్దో” నేర్పుతుంది. మన నమ్మకాలను తిరగరాస్తుంది, విలువలతో ఎలా బలంగా నిలబడాలో తెలుపుతుంది, మనకున్న అసలైన బాధ్యతలు ఏమిటి, వాటిపైనే శ్రద్ధను ఎంత , ఎలా పెట్టాలన్న సందేశాన్ని అందిస్తుంది.

ప్రతి విషయాన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: ప్రతి చిన్న విషయం గురించి అతిగా ఆలోచించి బాధపడటం వల్ల మన శక్తే తగ్గుతుంది. అందుకే నిజంగా ముఖ్యమైన విషయాల పైనే మన శ్రద్ధను వుంచాలి.

బాధ తప్పనిసరి: సుఖం కాదు, “బాధ” మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మనం ఎలాంటి బాధను ఎంచుకుంటామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.

నిజాలను అంగీకరించు: సంతోషం కోసం కొన్ని కొన్ని పనుల్ని బలవంతంగా చెయ్యడం, ఒప్పుకోవడం చేయడం మంచిది కాదు. మన జీవితంలోని లోపాలను అంగీకరించి వాటిని మెరుగుపర్చుకోవాలన్న ధైర్యం వుండాలి.

నీవు ప్రత్యేకమైనవాడవి అనేది ఒక భ్రమ: ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకం అనే భావన సరైనది కాదు. ప్రతి ఒక్కరూ జీవితంలో విజయాన్ని కష్టపడే సాధించాలి. ఒకరు చెయ్యగలిగింది ప్రతి ఒక్కరూ చెయ్యగలరు.

విలువలు ముఖ్యం: ప్రతి ఒక్కరి జీవితంలో విలువలను కలిగి ఉండాలి. అందరూ దయ, బాధ్యత, నిజాయితీ వంటి విలువల మీద ఆధారపడి జీవించాలి.

మన నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి: మనం తీసుకునే నిర్ణయాలే మన బాధ్యతలు, అవి జీవన పథాన్ని మారుస్తాయి. ఎప్పటికైనా బాధ్యత తీసుకోవడం నేర్చుకోవాలి.

‘నో’ అని చెప్పడం నేర్చుకోవాలి: జీవితంలో ప్రతి ఒక్కరికి “ఎస్” అని చెప్పడం వల్ల మన స్వేచ్చని కోల్పోతాము. సరైన విషయాలకే “ఎస్” ఆని అవసరంలేని వాటికి “నో” అని చెప్పడం అవసరం.

కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండకపోవచ్చు: జీవితం అనేది పూర్తి పర్ఫెక్ట్‌గా ఉండదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండకపోవచ్చు. అంగీకరించడమే మానసిక ప్రశాంతతకు మార్గం.

జీవితం చిన్నది: నిజమైన విలువలకే ప్రాముఖ్యత ఇవ్వండి, జీవితం చాలా చిన్నది. మన శక్తిని, శ్రద్ధను ఖర్చు పెట్టడానికి అర్హత గల విషయాలపైనే దృష్టి పెట్టాలి.

ఓటమి ఓ పాఠం, భయపడొద్దు: ఓటమి అనేది ఓ గొప్ప గురువు. మనం ఎదగాలంటే తప్పిదాల నుంచే నేర్చుకోవాలి.

ఈ పుస్తకం మన ఆలోచనా విధానాన్ని మార్చేయ్యగలదు. ప్రతి ఒక్కరూ ఒకసారి చదవాల్సిన పుస్తకం ఇది. మీరు కూడా మీ నిజమైన విలువను కనుగొనాలనుకుంటే ఈ పుస్తకం తప్పకుండా చదవండి.

జీవితం పట్ల మనకున్న నమ్మకాలను
తిరగరాయాలనుకుంటే,
ఈ పుస్తకం తప్పకుండా చదవాలి👇
The Subtle Art of Not Giving a F*ck

నిరాశ మధ్య వెలిగే ఆశ – ఓ మనిషి ప్రయాణం – Man’s Search for Meaning

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading