Menu Close

Thangedu Puvvu Song Lyrics In Telugu – Radha Krishna

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

తంగేడు పువ్వులాంటి… నా బుగ్గ మీదనా
సింధూరం పూసిండే సిలకో…
తంగేడు పువ్వులాంటి… నా బుగ్గ మీదనా
సింధూరం పూసిండే సిలకో… ఓ ఓ

గుళ్ళోన గంటలాంటి… నా గొంతు మీదనా
మౌనాలు చల్లిండే మొలకో… ఓ ఓ
నీలాల కన్నుల్లో మెరుపున్నోడే… మేఘాల పైనుంచి ఉరికొచ్చిండే
మంత్రం వేసేసిండే… మొత్తం మార్చేసిండే
ఏమి చేయొద్దంటే వినడే… ఏ ఏ, పిలగాడే…

గట్టు దాటని పిల్లంగోవిని… పిల్ల గాలిలా గిల్లినాడే
పచ్చి కొమ్మలా ఉన్న గుండెని… కొయ్య బొమ్మలా చెక్కినాడే
తెల్లారిందో అద్దాన్ని సతాయించేస్తున్నానుగా…
చుట్టూ ఉండే అందరినీ… వెలేస్తున్నానే వింతగా
నిన్నా మొన్నా ఇట్టా లేదే… సిలకో ఓ ఓ

తంగేడు పువ్వులాంటి… నా బుగ్గ మీదనా
సింధూరం పూసిండే సిలకో… ఓ ఓ

ఉన్నపాటుగా ఉన్న చోటనే… ఎన్ని వింతలో నమ్మలేనే
కంటి నిండుగా ఇంత సంబరం… ఒక్క మాటలో చెప్పలేని
కల్లో కూడా చూల్లేని నిజంలా… ఉందే నా కధా
సంతోషంలో అందాన్ని…. ఇవ్వాలె చూస్తున్నా కదా
ఇంకా ఇంకా ఏం చేస్తాడో మొలకో… ఓ ఓ

తంగేడు పువ్వులాంటి… నా బుగ్గ మీదనా
సింధూరం పూసిండే సిలకో…
గుళ్ళోన గంటలాంటి… నా గొంతు మీదనా
మౌనాలు చల్లిండే మొలకో… ఓ ఓ

నీలాల కన్నుల్లో మెరుపున్నోడే… మేఘాల పైనుంచి ఉరికొచ్చిండే
మంత్రం వేసేసిండే… మొత్తం మార్చేసిండే
ఏమి చేయొద్దంటే వినడే… ఏ ఏ, పిలగాడే…

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading