Menu Close

Tenchukunte Tegipotunda Song Lyrics In Telugu – Preyasi Raave

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Tenchukunte Tegipotunda Song Lyrics In Telugu – Preyasi Raave

తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం…
తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం…

తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం
ఏడు అడుగులు నడిచిన వాడే… ఏడు జన్మలు తోడుంటాడు
భర్తగా నిను భరించు వాడే… బ్రతుకు దీపం వెలిగిస్తాడు

అతని హృదయం నాతి చరామి…!
అగ్ని హోత్రమె అందుకు హామి… ||2||

తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం…
తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం…

శ్రీవారిని పూజించాలి… చిరునవ్వుల హారతితో
దాంపత్యం వికసించాలి… తరగని మురిపాలతో
దాసి నీవై ప్రేయసి నీవై… నీవే తన ప్రాణమై…
నిండు ప్రేమను తనకందించు… నూరేళ్లూ నడిపించు…

పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై… ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి
ఎన్ని జన్మలైనా…
మగని హృదయం మమతల నిలయం… మగువకే దేవాలయం ||2||

తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం…
తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం…

తెగువతో తన పతి ప్రాణాలే… తిరిగి తెచ్చును ఇల్లాలే
అడవిపాలై వెడలిన పతిని… అనుసరించును ఇల్లాలే

చెదిరిపోని నుదుటి రాతకు… శ్రీకారం దంపతులే
గాయం ఏ ఒక్కరిదైనా… కన్నీళ్లూ ఇద్దరివే…

పగలు రేయిగా… బ్రతుకే హాయిగా…
కలకాలమూ నిలవాలి మీరు… పసుపు కుంకుమలుగా…

ఆలుమగలే సృష్టికి మూలం… వారికే తల వంచును కాలం ||2||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading