Menu Close

నిష్కల్మషమైన స్నేహం – Telugu Stories on Friendship

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నిష్కల్మషమైన స్నేహం – Telugu Stories on Friendship

నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. నా భార్య పెద్ద గా కేక పెట్టి ఎంత సేపు ఆ న్యూస్ పేపర్ చదువుతారు. మన పాప అన్నం తినడానికి పేచీ పెడుతోంది. దానికి నచ్చ జెప్పి అన్నం తినిపిస్తారా అని అడిగింది. నేను న్యూస్ పేపర్ ప్రక్కన పెట్టి వచ్చి చూసే సరికి పాప కళ్ళనిండా నీళ్ళు. దాని ముందు అన్నం కంచం.

మా పాప పేరు సింధు అప్పుడే ఎనిమిదవ సంవత్సరం వచ్చింది. ఆ వయసు వాళ్ళకు ఉండే తెలివి తేటల కంటే పాపకు కొంచెం తెలివి తేటలు ఎక్కువే. నేను అన్నం కంచం చేతిలోకి తీసుకుని సింధూ మీ నాన్న కోసం రెండు ముద్దలు అన్నం ఎందుకు తినవు అని ముద్దుగా అడిగాను. నువ్వు తినకపోతే మీ అమ్మ గట్టిగా కోప్పడుతుంది అన్నాను. నాకు ఇష్టం లేకపోయినా ఒక్క ముద్ద కాదు మొత్తం అన్నం అంతా తింటాను. డాడ్ నేను ఏది అడిగితే అది ఇస్తావా.అని అడిగింది.

అలాగే అన్నాను. అమ్మ కూడా నేను అడిగినదానికి ఒప్పుకోవాలి అంది. నా భార్య, సింధు బుగ్గ మీద ఒక చిన్న దెబ్బ వేసి అలాగే అంది. సింధూ నువ్వు కంప్యూటర్ లాంటి ఖరీదైన వస్తువులు కొనమని మాత్రం అడగవద్దు. అంత ఖరీదైన వస్తువులు కొనడానికి మన దగ్గర కావలసినంత డబ్బు లేదు అన్నాను. నేను ఖరీదైన వస్తువులు కొనమని అడగను అని మొత్తం మీద అన్నం అంతా తినేసింది.

తరువాత సింధు నెమ్మదిగా నావద్దకు వచ్చి డాడ్ ఆదివారం నేను నాజుట్టు పూర్తిగా కత్తిరించుకుంటాను. అని అడిగింది. నా భార్య ఆమాట విని కోపంతో ఆడ పిల్ల అలా చేస్తే ఎంత అసహ్యం గా ఉంటుందో నీకేమైనా తెలుసా అని పెద్ద కేక పెట్టింది. మన ఇళ్ళలో ఎవరూ అలా చేయరు. ఇది టి.వి చూసి పాడయిపోతోంది. మన సంస్కృతి ఈ టి.వి ల మూలం గా నాశనమయిపోతోంది అని మా అమ్మ విసుక్కుంది. సింధూ ఇంకేమైనా కావాలంటే ఇస్తాను బోడిగుండుతో నిన్ను చూడలేను అని ముద్దుగా నచ్చ జెప్పే ప్రయత్నం చేశాను. అది వినలేదు. మొత్తం మీద దాని పట్టుదల వల్ల దాని జుట్టు మొత్తం కత్తిరింపించి గుండు చేయించాను.

friends bald head

ఒకరోజు ఉదయం సింధు ని స్కూల్ దగ్గర విడిచి రావడానికి వెళ్లాను. సింధు తన తరగతి వైపు నడచి వెడుతోంది. అప్పుడే ఇంకో బాబు కారు దిగాడు. సింధూజా నేను కూడా వస్తున్నాను ఆగు అని కేక వేశాడు. ఆ పిల్లవాడి నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. మా అమ్మాయి తన తల మీద జుట్టు కత్తిరించు కోవడానికి ఆ బాబే కారణం అని అర్ధమైంది. ఆ బాబు వెనకాల ఒక స్త్రీ కూడా దిగింది తనను తాను పరిచయం చేసుకో కుండానే ఆమె నాదగ్గరకువచ్చి ఇలా చెప్పింది. ఆ పిల్లవాడు మా అబ్బాయి హరీష్.

లుకేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. గడచిన నెల అంతా మా అబ్బాయి స్కూల్ కు రాలేదు. వాడికి కీమోతెరఫీ చేయిస్తే వాడి జుట్టు పూర్తిగా రాలిపోయింది. తోటి పిల్లలు ఏడిపిస్తారని స్కూల్ కు రావడం లేదు. పోయిన వారం సింధుజ మా ఇంటికి వచ్చింది. మా పిల్లవాడిని మిగిలిన పిల్లలు ఏడిపించకుండా చూస్తానని చెప్పింది. కాని మా బాబు కోసం తన అందమైన జుట్టును త్యాగం చేస్తుందని నేను ఊహించలేదు. అలాంటి కుమార్తెను కన్న మీరు మీ భార్య చాల గొప్పవాళ్ళు. ఈ మాటలు విని నేను ఒక్క క్షణం కదలకుండా నిలబడి పోయాను. నీ తోటి వాళ్ళ విషయం లో నీ ప్రేమ ఎంత నిష్కల్మషమైనది. అని అనుకుని ఆశ్చర్య పోయాను.

నీతి: ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే వారెవరంటే తమ ఇష్టం వచ్చినట్లు ఉండాలనుకునే వారు కాదు తాము ఇష్టపడే వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా తమ ఇష్టాలను మార్చుకునే వారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading