Menu Close

కంటికి కనిపించే ప్రతిభ వెనుక కొన్ని యేళ్ళ సాధన దాగి వుంటుంది – Telugu Stories


కంటికి కనిపించే ప్రతిభ వెనుక కొన్ని యేళ్ళ సాధన దాగి వుంటుంది – Telugu Stories

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు. రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది. బజారులో పేయింటింగ్ ఎలా చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యునతి మొండిగా మారాం చేసే సరికి ఒక పేపర్ పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు.

ఇస్తూ ఇస్తూ ….నవ్వుతూ అన్నాడు దీని విలువ కోటి రూపాయలు. జాగ్రత్తగా కాపాడుకో. ఆ యువతి ఆశ్చర్యంగా పేయింటింగ్ వంక చూస్తూ ఉండి పోయింది. మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని వాకబు చేసింది. ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి నోటమాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది.

రవివర్మని కలిసి ఇలా అంది … మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు. నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా…. పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను. రవివర్మ నవ్వుతూ అన్నాడు అమ్మాయీ…! నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.

telugu stories paint cow

నువ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు. ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది. ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది. తల్లి తండ్రులు నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి. అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది. ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి.

Like and Share
+1
13
+1
2
+1
0
Posted in Telugu Stories

Subscribe for latest updates

Loading