Menu Close

ఏదైతే నువ్వు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది-Telugu Stories


Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే వెంటనే షేర్ చెయ్యండి.

ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవితం సాగిస్తుండేవాడు. కొన్ని పాలని ఊరిలో అమ్మి ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు. భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది, ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి, ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.

యజమాని అన్ని తూకం చేసి చూస్తే అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి. ఆయనకు మనసుకు చాలా బాధ అనిపించింది ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే. నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు.. మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు అప్పుడు యజమాని చెప్పాడు నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి, నెయ్యి 1kg అని 900gm ఇస్తావా ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు…

అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమాని తో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ మోసగాణ్ణి కాదు. నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర ఆధారంగా ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు.. అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు..

మిత్రులారా. మనం వేరేవారికి ఏం చేస్తామో తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ, దుఃఖం కానీ సంతోషంకాని, మోసగించటం కానీ మోసపోవటం కానీ, తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది…………

పాలను ఆశించి గోవును పోషిస్తాము గోవు నుంచి మనకు పాలు వస్తాయి. అంతే కాదు పేడ కుడా వస్తుంది. పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం. కాని, పేడని మాత్రం ఇంటి బయట వేస్తాం. ఆవు నుండి పాలు మాత్రమే రావాలి, పేడ రాకూడదు అంటే వీలు కాదు.


కర్మలు కూడా ఇలానే ఉంటాయి. ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్ధవంతంగా ఉంటుందని చెప్పలేము. కొంత అభ్యంతరకరంగా కూడా ఉండవచ్చు. సంబంధాలు కూడా ఇలానే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా…. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా జీవించడం సాధ్యపడదు. కాని సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. విషాదం కూడా కలిసి ఉంటుంది.


తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనతో కలిసి జీవిస్తున్న ఎవరైనా కావచ్చు.. వారిలో మనకు అన్ని నచ్చిన గుణాలే ఉంటాయని చెప్పలేము. మనకు నచ్చనివి వారు మేచ్చేవి కూడా ఉంటాయి.. అలాంటివి ప్రేమకి, సౌఖ్యానికి ప్రతిబంధకాలే కావచ్చు.. కాని అవి లేకుండా సంబంధాలు లేవు.


గులాబీల మధ్య ముళ్ళు తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన సంఘర్షణలు తప్పవు.
మనిషి జీవితంలో ఎన్నటికైనా ఏ అవసరం లేని క్షణం ఒకటి వచ్చి తీరుతుంది. కాని, బ్రతికున్నంత కాలం అవసరాలతో పాటు అప్పుడప్పుడూ తొంగిచూసే అనవసరాలను కూడా పెద్ద మనసుతో అంగీకరించే శక్తిని పెంచుకుంటేనే జీవితాన్ని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఆస్వాదించగలం..

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Share with your friends & family
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading