ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక గురువు తన శిష్యులతో అరణ్యమార్గాన వెళ్తుండగా ఒక నదిని దాటవలసి వచ్చింది. అదే సమయంలో నదిని దాట లేక ఒక యవ్వనవతి ఆ శిష్యుల సహాయాన్ని అర్థించింది. అందరూ నిరాకరించినా, ఒక శిష్యుడు మాత్రం ఆమెను ఎత్తుకుని నది దాటించి, కిందకు దించాడు.
సాయం చేయడం, పొందడం వరకే చూడాలి – Great Stories in Telugu – Telugu Stories
తర్వాత ఆమె దారిన ఆమె వెళ్లిపోయింది. రాత్రి ఒక అనుకూలమైన చోట విశ్రమించిన తర్వాత శిష్యులంతా ఆ గురువు దగ్గరకు వచ్చి, ‘మనమంతా బ్రహ్మచర్యం పాటిస్తున్నాం కదా, ఆ శిష్యుడు స్త్రీని ఎత్తుకొని నది దాటించాడు..’ అని ఫిర్యాదు చేశారు. దానికి గురువు ‘ఆ శిష్యుడు ఆ స్త్రీని అక్కడే దించి వేశాడు. కానీ, మీరంతా ఇంకా ఆమెను మీ మనసులో మోస్తూనే ఉన్నారు’ అన్నాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com