Menu Close

కథ ఈ కధ రాసిన వారు ఎవరో తెలియదు కానిచాలా మంది కి కనువిప్పు కలిగించే కధ-Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

” శిరీ ..! ఒక సారి ఇలా రా” వేడి నీటి స్నానంతో సేదతీరి , perfume వేసుకుంటున్న శిరీష ని పిలిచాడు కుమార్ లాప్ టాప్ లో పని చేసుకుంటూ ..!
“ఒక్క నిమిషం” జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది .
“అబ్బబ్బ! ఈ పిల్లలు ఒకపట్టాన పడుకోరు కదా! పెద్దవాడిి కి కథలు కావాలి. చిన్నోడు అయితే నా వొళ్ళో పడుకోబెట్టుకొని జోకొట్ట మంటాడు. ఇద్దరూ పడుకునే సరికి ఇంత లేట్ అయింది. ఎప్పటి కి పెద్ద వాళ్ళు అవుతారో ఏమో”!
పిల్లలు ఇద్దరినీ వాళ్ళ రూం లో నిద్రపుచ్చి, తలుపులు వేసి వచ్చెసరికి రోజూ ఇదే టైమ్ అవుతుంది.
“ఆ..చెప్పండి. ఏంటో పిలిచారు కదా! వచ్చి పక్కనే.కూర్చుంది.


ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి,హాల్ కి మరో పక్కగా.ఉన్న బెడ్రూం దగ్గర ఆగాడు.
దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు. పక్క పక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద. ఆదమరిచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు ఒకరి.చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని…
ఏదో అనబోతున్న శిరీష ని హుష్ అంటూ సైగ చేసి, నిశబ్దం గా తలుపులు మూశాడు కుమార్ .
విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్రూంలో కి వచ్చింది.
“చూసావుగా శిరీ! వాళ్ళు ఎలా పడుకున్నారో వొళ్ళు తెలియకుండా! …confusing గా చూసింది అతనివైపు.
“మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట? ఎక్కడ ఉంటాడట. మీ అమ్మగారు ఏమంటున్నారు?”. ఏ భావం మొహం లో కనబడ నీయకుండా అడిగాడు.


ఉలిక్కి పడింది శిరీష, ‘తాను పిల్లల రూంలో కూర్చుని, అమ్మతో ఫోన్లో మాట్లాడింది విన్నాడన్నమాట..
“అమ్మ తమ్ముడు కి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని, వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తాను ఏమన్నదీ?!
“మా ఇంట్లోనే ఉంటాడు లేమ్మా! రూం అడ్జస్ట్ చేస్తాలే! మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్ లో కి షిఫ్ట్ చెస్తాలే! అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకోళ్లు చేయ్యేసుకొని పడుకుంటారు. చూడటానికి మాకే సిగ్గు వేస్తుంది. హాల్ లో అలా పడుకుంటే అసహ్యం గా ఉంటుందని ఆలోచిస్తున్నా! సరే ..ఏదో చెప్పి వాళ్ళని హల్ లో పడుకో బెడితే వాళ్ళే సర్దుకుంటారు. సర్దు కోక ఏమి చేస్తారు? ఎక్కడికీ పోతారు? అలా ఉండలేమంటే ఇక వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా పోనీ”
తను మాట్లాడింది అంతా అతను విన్నాడని అర్ధం కాగానే కొంచెం గాభరాగా అనిపించినా, మాట్లాడకుండా తల దించుకుంది.


“శిరీ! ఎక్కడో మా వూళ్ళోఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి, ఇక్కడ మూడు బెడ్రూంల ఫ్లాట్ కొనుక్కునే దాకా సతాయించావు. సరే! వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండవలసిన వారే కదా, అని వాళ్లకి ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకు వచ్చాను.”
” మనం ఇక్కడ అద్దెలు కట్టుకొలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసివస్తుంది అని వాళ్లు వొప్పుకున్నారు. వచ్చినప్పటి నుండి మనకు చాకిరీ చేయటం లోనే మునిగిపోయారు వోపిక లేకున్నా!
నువ్వు, నేను పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లి ఏ రాత్రో వచ్చేదాకా, పిల్లలని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు.
వాళ్ళ కి వేరేగా వండి, తినిపించి,ఆడించి, పగలంతా వాళ్ళ, అల్లరి భరించి, సాయంత్రం మనం వచ్చే సరికి కడిగిన ముత్యాల్లా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు శ్రమపడుతున్నరో గమనించావా ఎప్పుడైనా! ఒక్క రోజైనా హాస్పిటల్ కి తీసుకెళ్లే అవసరం రానీయకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా?


పూట పూటకీ రుచిగా, వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే, కడుపు నిండా తినటమే తప్ప ఒక్క రోజైనా ఆమెకి సహాయం చేసావా?
నాన్న ఈ వయసు లో కూడా ఇల్లు శుభ్రం గా ఉంచటానికి, పిల్లల్ని శుభ్రం గా ఉంచటానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా!?
ఆదివారం రాగానే , నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు. ఒక వారం ఛారిటీ కలెక్షన్స్, ఇంకో సారి కిట్టిపార్టీ, ఒకవారం పిల్లలతో outing, ఒక వారం రెస్ట్….. అయినా అమ్మ ఒక్క రోజు కూడా విసుక్కొలేదు పైగా”పోనీలే! వారమంతా ఆఫీస్ పని కదా! ఒక్కరోజు దానికి ఇష్టం అయినట్టు ఉండనీ”! అంటుంది.
తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలిసి పోయిన అమ్మకి రెస్ట్ తీసుకో వాలనీ, పడుకోవాలని అనిపించదా చెప్పు!
ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి, రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్లనొప్పి, నడుం నొప్పితో బాధ పడుతుంటే నాన్న ఆమె కి ఆయిట్మెంట్ రాసి కాపడం పెడితే, పాదాలకు మసాజ్ చేస్తుంటే, అది నీకు వేరే విధంగా అనిపించిందా?
80 ఏళ్ల నాన్నకి రాత్రి పూట చాలా సార్లు బాత్రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది. నిద్ర మత్తులో ఒక్కోసారి తూలి పడిపోతుంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేక పోతానని అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది. ఆయన తో పాటు మెళకువ రావటానికి. అది నీకు శృంగారం గా కనిపిస్తున్నదా?


వయసు మళ్ళిన ఇద్దరికీ ఎవరు ముందు తమను విడిచి వెళ్లి పోతారో అని లోలోపల భయం. దానికి తోడు మనకి కూడా మాట్లాడటానికే time ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరికి ఒకరు నీడగా ఉంటారు. అది కూడా నీకు తప్పు గా ఉంది.
మీ తమ్ముడికి రూం ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు. అతడి హాస్టల్ ఖర్చు మనం ఇద్దాము.
మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాము. మనకు కూడా అలాంటి స్థితి వస్తె ఎలా ఉంటుందో వూహించుకో!
“వార్థక్యం తప్పేది కాదు, తప్పూ కాదు. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చక పోతే నేను ఉన్నది ఎందుకు? దండగ కదా!”
“ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను వోప్పు కోను. ” ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదికి చేరుకున్నాడు కుమార్ .

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
2
+1
1
+1
0

Subscribe for latest updates

Loading