Menu Close

పెళ్లిసందడి. 1940 కి పూర్వం…👇

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

కానివ్వండర్రా…
మగ పెళ్ళివాళ్ల బండ్లు అప్పుడే పెద్దినాయుడు గారి గరువుకు చేరాయట…ఇంకో ఘడియలో ఊరిపోలిమేరలోకి వచ్చేస్తాయి…
ఆ మేళగాళ్ళేక్కడ తగలడ్డారో… ఎదురు వెళ్ళితీసుకురావద్దూ…
అబ్బాయీ…కాస్త వంటపందిరిలోకి చూసి… వంటవాళ్లను తొందరపెట్టు…విడిదిలోకి పలహారాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారో..లేదో..
అమ్మా ఆ ముత్తైదువలసింగారం ఎంత వరకొచ్చిందో చూడు… ప్రతీవాళ్ళూ పెళ్లి తనకే నన్నట్టు తయారై.పోతున్నారేవిటీ…త్వరగాతేమలండీ..
ఊరి పెద్దలు నలుగురూ వచ్చి పంది రిలోకూర్చున్నారు… కామేశం…వాళ్ళసంగతి కాస్తచూసుకో నాయనా…
ఆరేఅబ్బాయి… ఒక్కగానొక్క పిల్లదాన్ని… 6 మైళ్ల దూరమిస్తావా… ఏమీ…మీఅగ్రహారంలో ఆపాటి పిల్లవాడు దొరక్కపోయాడా…
అయ్యోరూ…


కాగడాల వాళ్ళమండీ…
నాలుగు పాత గుడ్డలిప్పిస్తే మాపనిమీదుంటాం బాబూ…
బావా…పెట్రోమాక్సు లయిట్లు…పది తెచ్చాము…ఈ ఊర్లో అంతకు మించి లేవట…
పల్లకి వాళ్ళడుగుతున్నారు… పొలిమేరలోకి పోయి కరణం గారి తోటదగ్గర తయారుగా ఉంటారట…
పందిరిలో నాలుగు కుర్చీలు వేయాలి… ఈకుర్రాళ్లంతా ఏరిరా… సానిమేళం చుట్టూ మూగారూ… ఇక ఈముండలొస్తే… మనమాట ఓ లెక్కా…
బాబయ్యా… మునసబు గారి గుర్రాన్ని తెచ్చానండీ…ఎక్కడ కట్టమంటారూ…
అయ్యా పెదరాజు గారు… మగపేల్లొళ్ళకోసమట… అరిటిగేళ్ళు… పనసకాయలు పంపారండి… రెపటినుండి…5 రోజులూ దివాణం నుండే పాలు,పేరుగులు పంపిత్తామని సెప్పమన్నారు…
అయ్యా…పెద్ధిశెట్టిగారబ్బాయి నండీ… మానాయన ఈ రొక్కం మీకిమ్మన్నారండి… తర్వాత చూసుకుందామని సెప్పాడండి…!
పెళ్లిసందడి…1940 నుండి 1990 వరకు…👇


అయ్యా కట్నం ముఖ్యం గాదండీ…మాకు లాంఛనాలేమిస్తారూ… అడబడుచులు ఆరుగురు… వాళ్ళసంగతేవేటీ… పిల్లవాడికి బండి కావాలట… మీపిల్లకి బంగారం మీరేలాగూ పెట్టుకుంటారుకదా… పెళ్లి మీ ఇంటివద్దే… మేము తరలి రావటా నికి…ఎన్ని బస్సులు పెడతారో…
పెళ్లి కుమారుని బావలు కార్లో తప్పరారట… మీ ఇంటి దగ్గర పెళ్లంటే కాస్త ఇబ్బందే…
ఓ కళ్యాణ మండపం చూద్దురూ… కాస్త ఘనంగా పెళ్లిచేస్తే నలుగురూ మెచ్చుకోరూ… ఈ రోజుల్లో అంతా టేబుల్ మీల్స్ అంటున్నారు… కొంపదీసి… చాపకూడనరుగదా… కాస్తబ్యాండు మేళం ఉంటేచూడండి… మా బంధువర్గానికి శెలవలు కష్టమట… అటుంచి ఆటే ట్రైన్సికి వెళ్తారుట… వివరాలిస్తాను… రిజర్వేషన్స్ దొరుకుతాయేమో చూద్దురూ…!
పెళ్లిసందడి1990 నుండి 2020 వరకు…👇


కట్నం మాకు పట్టింపు లేదండీ…పిల్లలిద్దరూ ఉద్యోగులే కదా… కాకపోతే… లాంఛనాలు ఘనంగా ఉండాలి… పెళ్లి మీరెలా చేశారని మేమడగం… రి సేపక్షను హైదరాబాదులోనే… మాకుసర్కిల్ ఎక్కువండీ…తప్పదు…ఏ ఫంక్షన్హాలో బుక్చేయాలి మరి… ఘనంగా మాహోదాకు తగ్గట్టు చేస్తారుకదా…!
పెళ్లి సందడి మార్చి.2020 నుండి…👇
మాఅబ్బాయి పెళ్లి… ఫలానా అమ్మాయితో… వాళ్ళింట్లోనే…మీరెవరూ పెళ్ళికి రావద్దు…50 మందికే పరిమితం. ఆడ పెళ్లి వాళ్ళకి 20 ఇవ్వగా మిగిలింది 30. అందులో మీపేరులేదు…కనుక మీరొస్తే పోలీసులు చర్య తీసుకొంటారు…అందుకు మాబాధ్యత లేదు…
ఇక… పెళ్లిలో…ఎవరి మాస్కులు వారివే… సానీటైజ్రు ఎవరికి వారే… మెసేజీలు పెట్టాం…లింక్ ఇచ్చాము… చూడాలనిపిస్తే… నీకొంపలోనుండే చూసుకోవచ్చు…
ఖంగారు పడకండి… పెళ్ళిభోజనాలు లేవు… కరోనా సమయంలో… క్యాటరింగ్ వాళ్ళు. హోం ఐసోలేషనులో ఉన్నారుట…ఇళ్ళు కదిలితే కాళ్లిరగ దీస్తామని… పోలీసువారు వారికి మనవి చేసుకొన్నారుట…ఇక పరిస్థితులు చక్కబడినతర్వాత… ఘనంగా రెసెప్సను… పెట్టుకోవాలని… ఉభయపార్టీల అంగీకారం. అప్పటికి పోయినవారు పోగా… మిగిలినవారితో… అప్పటి ప్రభత్వ నియమనిబంధనలనుసరించి… రిసెప్షన్ ఉంటుంది…!

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading