Latest Telugu Stories, Telugu Moral Stories, Best Telugu Stories, తెలుగు కథలు, Telugu Kadhalu
ఏంబో..ఇంటాండావ నా మాటలు..ఇనపడ్తాండాయా..అని..రోంత గదురుకున్యట్టు అడిగింది..సుబ్బక్క.. వాల్ల పెనిమిటి బోడెబ్బిని…చేయ్..ఏందే నీయా..క్క..నీ పోడు..ఏంజేయాలంట…అదే..మీయమ్మ కైయ్య మీ తమ్ముడే సేసుకుంటాండు కదా..మూడేల్లముంచి…మనకీమని అడగ్గూడదా…మనకు పిల్లోల్లు ఎక్కొచ్చాండారు..ఏం మనక్కూడ అక్కు ఉండాది కదా…
చేయ్…అక్కూ..గిక్కూ..అన్యావంటే మెట్టుతో ఎంపలాడ్తా…మాయమ్మకు యా పద్దన్న బూ సక్రంగ పెట్నావా…ముసిల్దొచ్యాలకు మూతి ముప్పైయారు సొట్టలు పెడ్తాంటివే…పొద్దలచ్చం పన్జేసివచ్చినా నీయక్క…ఏపొద్దన ఉడుకుడుకు నీల్లు కాంచిచ్చినావ…
మా యమ్మ నోరుతెరిచ్చే యాడమానం పోద్దో అని …అట్టనే నెట్టకట్టచ్యాంటే..ఒక్కరవ్వ పాలుమాల్యాలకు.. ఏం మేమొక్కరమేన నీకు పుట్టిందని నడిపోనికాడికి తరిమితివే…మల్లా ఇపుడు ఎట్టడుగుతావంట…
ఏం..ఆయనొక్కడే..జూపిచ్చిండ.. మనం గూడ లెక్కిచ్చినాం గద…ఆస్పత్రి కాడికి పోయినాం గదా…
ఓయబ్బ..సాల్లేయే నీ సంబడం…ఎంత లెక్కిచ్చినావు…మాయమ్మను తీసుకోని మా నడిపోడు ఒక రాజ్జెం తిరిగిండా…మాయమ్మకు ఈ నేల మీద నూకలుండాయి కాబట్టీ బతికింది.. ఇపుడేదో..ఆమెకు కాల్జేయి ఆడతా నేదరి పిల్లోల్లకు రోంత వానికి తోడుగా ఉంది..వానికాడ్నే ఆమె ఉండాది కాబట్టి..ఆమె ను సాకేందుకు..ఆ బూమిలో పండిన బత్తెం..వానికే న్యాయంగ పోవాల….అనె బోడెబ్బి..
ఓయబ్బో…ఎల్లొచ్చిండబ్బా..అరిచ్చెంద్రుడూ..ఎల్లకాలం ఆయిప్పే తినాల్న…అందరూ కల్సిమాటాడుకోని ఆమెను తలా నాలుగు నెల్లు ఇంట్లో పెట్టుకోని…ఆమె కైయ్యలో వచ్చిన గింజెలు మూడుబాగాలు.తీసుకుంటే సరిపోద్ది…ఆమె..మీ అందరికీ అమ్మే కద…మనం నోరెత్తకుండ ఉంటే సల్లగ..సరిజేచ్చరు…మీ సినతమ్ముడు ఎట్టైన ఇపుడు కరోన అని ఊర్లోనే ఉండాడు గద..మాటాడుకోండి..అన్యది సుబ్బక్క..
ఏందే..నీతో..వానితో..మాట్లాడేది..సాకడానికి రాని సేతులు పంచుకోడానికి ఎంపలాడ్తాండాయే…ఇంగోసారి..మల్లా..ఈ..మాటెత్తితే పక్కబర్లు ఇరుగుతాయి…తు..నీయక్క..నీకాడ కూసున్య దరిద్రం..అంటా..గొణుక్కుంటా..తువ్వాల బుజానేసుకోని..ఈదిలోకి పోయిండు…(ఇంగా ఉందిబో)
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com