Menu Close

పేదరికాన్ని ఎగతాళి చెయ్యకూడదు – Inspiring Stories in Telugu


పేదరికాన్ని ఎగతాళి చెయ్యకూడదు – Inspiring Stories in Telugu

చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు – మీ కోసం ఏమి తీసుకురావాలి? ఆ వ్యక్తి ఇలా అన్నాడు “జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌లో దోశ తినిపిస్తాను, అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను.”

IAS Smita Sabharwal

మా అమ్మాయి వాగ్దానాన్ని నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి. “వెయిటర్ అడిగాడు” మరి మీ కోసం ఏమి తీసుకురావాలి? “అతను అన్నాడు” నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు..

“మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పి “నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు.” అప్పుడు యజమాని అన్నాడు, “ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు. ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు.

హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు.. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. అ యజమాని వాళ్లకి మూడు దోశలు తో పాటు పొరుగువారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు. చాలా గౌరవం ఇచ్చిన అతను, అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తన ఇంటికి వెళ్ళారు. సమయం గడిచిపోయింది.

ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు ఒక అటెండర్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియజేయమంది. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది.

అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు, ఆమె ఇలా చెప్పింది.

“మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు, ఎవరి తండ్రికి మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు🙏, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు..

ఈ రోజు నేను కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరపున.. ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను. అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
5
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading