ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇది గురునానక్ చిన్ననాటి సంగతి.
ఓరోజు గురునానక్ వాళ్ళ అమ్మ అతనికి ఓ స్వీట్ ఇచ్చి తినమంది.
అయితే గురునానక్ ఆ స్వీటుముక్క తీసుకుని వీధిలోకెళ్ళడానికి అడుగులు వేస్తుండగా అతని తల్లి అడ్డుపడింది.
“వీధిలోకెళ్ళకు. అటూ ఇటూ కుర్రాళ్ళు నీ దగ్గర లాక్కోవచ్చు. ఎవరికీ తెలీకుండా ఇంట్లోనే తినేసే” అంది.
గురునానక్ సరేనని ఇంట్లోనే ఉన్నాడు. అతని తల్లి పనులమీద బయటకు వెళ్ళి చాలాసేపు తర్వాత ఇంటికి చేరుకుంది.
అప్పటివరకూ గురునానక్ ఆ స్వీట్ తినలేదు.
“ఎందుకు తినలేదురా?” అని గురునానక్ ని తల్లి అడిగింది.
“ఎలా తినగలనమ్మా? ఎవరికీ తెలీకుండా ఎవరూ చూడకుండా తినేసేమన్నావు. కానీ అదెలా సాధ్యం? ఇరుగుపొరుగు వాళ్ళకు కనిపించకుండా తినగలను కానీ దేవుడు అంతటా ఉంటాడు కదమ్మా? మరి దేవుడు చూడకుండా ఎలా తినగలనమ్మా?” అన్నాడు గురునానక్.
అప్పుడు అతని తల్లికి తానన్న మాటలోని తప్పు తెలిసి బాధ పడింది.
యామిజాల జగదీశ్
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com