Menu Close

పేరు దేవుడిది, పొట్ట మనది – Devotional Telugu Stories


పేరు దేవుడిది, పొట్ట మనది – Devotional Telugu Stories

ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు.. గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

“ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ

పూర్ణమేవావశిష్యతే”.

Lord Tirupati Balaji god Best Stories in Telugu

పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత, నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు.

దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది.

ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి, స్థూలరూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం.

అని వివరణ చేశారు గురువుగారు.

ఇప్పుడు పైన చెప్పుకున్న శ్లోకం యుక్క అర్ధం చూద్దాం..

ఓం పూర్ణమదః – పరబ్రహ్మం సంపూర్ణమైనది.
పూర్ణమిదం – సృష్టి లేదా జగత్తు కూడా సంపూర్ణమైనదే.
పూర్ణాత్ పూర్ణముదచ్యతే – సంపూర్ణమైనదానిలో నుండి సంపూర్ణమైనదే ఉద్భవిస్తుంది.
పూర్ణస్య పూర్ణమాదాయ – సంపూర్ణమైనదానిలో నుండి సంపూర్ణమైనదాన్ని తీసుకున్నా,
పూర్ణమేవావశిష్యతే – మిగిలేది కూడా సంపూర్ణమైనదే!

SUBSCRIBE FOR MORE

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading