ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Short Stories – పిట్ట కథలు
అతను కారుని ఒక షాప్ ముందు ఆపి, కూతురిని కారులోనే కూర్చోమని, “నేను ఇప్పుడే వస్తాను, నీకు చాక్లెట్లు కూడా తెస్తాను.” అని దిగి షాప్ లోకి వెళ్లాడు.
షాపింగ్ పూర్తి చేసి వెనక్కు వచ్చి చూసే సరికి కారులో కూతురు లేదు. బెదిరి పోయి చుట్టూ చూసాడు.
కొంత దూరంలో ఓ బిల్డింగ్ వైపు ఆరాధనగా చూస్తోంది. తండ్రి వచ్చి భుజం మీద తట్టాడు – “నన్నాపవద్దు నాన్నా! ఈ బిల్డింగ్ కు, నాకు ఏదో సంబంధం ఉన్నట్లుంది, గత జన్మలో అనుకుంటా !! ఆ బంధమేదో తెలుసుకోవాలి నాన్నా !”
అమ్మాయి చెంప మీద ఒక దెబ్బ వేసి, “పిచ్చి మొహమా! ఆపు నీ ప్రేలాపన! కరోనా రాకముందు రోజూ నీవు ఇక్కడికి వచ్చే దానివి – అది మీ స్కూలే వెర్రి మొహమా !!
సేకరణ – V V S Prasad