ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నేను కూడా నీ అంత బలమైన దాన్నే – Telugu Short Stories
ఎదురొస్తున్న తాబేలుతో, ఏనుగు, “అర్భకపు తాబేలా !! | తప్పుకో !! నా అడుగు మీద పడిందంటే పచ్చడై పోతావ్.” అనింది. తాబేలు నిర్భయంగా నిలబడింది. ఏనుగు దాని మీద అడుగేసింది. తాబేలుకు ఏం జరగలేదు. “నేను కూడా నీ అంత బలమైన దాన్నే. అనవసరపు గొప్పలు వద్దు !!” అనింది తాబేలు.
ఏనుగు చిన్న నవ్వు నవ్విపోబోతుంటే, ” ఇక్కడికి రేపు రా ! నా బలమేంటో చూపిస్తాను.” అని సవాలు విసిరింది. పక్క రోజు పొద్దున్నే కొండ దిగి, నది ఒడ్డున ఉన్న హిప్పోపాటమస్ ను కలిసి, “హిప్పోగారూ మనం టగ్ – ఆఫ్ వార్ అడుకుందామా ! నీకంటే బలవంతురాలిని నేను !” అన్నది తాబేలు.
హిప్పోపాటమస్ హేళనగా నవ్వి, సరే అనింది. తాబేలు ఒక పెద్ద తాడు తీసుకొచ్చి హిప్పోకు ఒకచివర నోటికందించి “నేను ‘రైట్’ అన్నప్పుడు గట్టిగా లాగు.” అనింది. కొండ పైకి పోయి తాడు రెండో చివర ఏనుగుకు అందించి ” నేను ‘రైట్’ అంటాను, గట్టిగా లాగు, ఎవరు బలవంతులో తేలుతుంది” అని చెప్పింది. తాబేలు కొండ దిగి మధ్యలో నిలబడి, ఇద్దరికీ వినబడేలా గట్టిగా ” రైట్” అని అరిచింది.
హిప్పో ఒక వైపు, ఏనుగు ఇంకొక వైపు తాడును గట్టిగా లాగడం మొదలుపెట్టాయి. ఒకరినొకరు లాగలేక అలిసిపోయి, తాబేలే బలమైనదని ఒప్పుకున్నాయి.
సేకరణ – V V S Prasad)