చిన్న కథలు, పొట్టి కథలు, నీతి కథలు
పురాతన కాలంలో చైనా దేశీయులు ప్రశాంతమైన జీవనం సాగించాలని చుట్టూ ఎత్తయిన గోడ కట్టారు. విదేశీయులు ఆ గోడ ఎక్కి చైనాలోకి రాలేరనుకుంది.
కానీ గోడ కట్టిన మొదటి శతాబ్దంలోనే చైనాపై మూడుసార్లు దండయాత్రలు జరిగాయి. ప్రతి యుద్ధంలోనూ విదేశీయులకు గోడ ఎక్కాల్సిన అవసరం రాలేదు.
ఆ గోడను కాపలా కాస్తున్న సైనికులకు లంచాలు ఇస్తే చాలు. తలుపులు తెరుచుకునేవి. చైనీయులు పెద్ద ఎత్తయిన గోడలు కట్ట గలిగారు గానీ, దాన్ని రక్షించే సైనికుల్లో దేశభక్తిని, నిజాయితీని రగిలించలేక పోయారు. కాబట్టి పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం కాదు, యువతలో సత్ప్రవర్తనను కలిగించాలి.
ఈనాడు సత్ప్రవర్తన, నైతిక విలువలున్న యువత కావాలి. ఒక దేశపు నాగరికతను నాశనం చేయాలంటే,
- ఆ దేశపు కుటుంబ వ్యవస్థను కూల్చేయాలి.
- విద్యా వ్యవస్థను నాశనం చేయాలి.
- ఆ దేశపు ఆదర్శ పురుషులను అగౌరవ పరచాలి.
- తల్లి అవమానింపబడితే కుటుంబ వ్యవస్థ కూలిపోయినట్లే.
- విద్యా వ్యవస్థను నాశనమైతే, ఉపాధ్యాయుడికి గౌరవం ఉండదు సమాజంపై గౌరవం లేక నిరక్షరాస్యులైన యువత అరాచక శక్తులుగా మారతారు.
- ఆదర్శ పురుషులను, మహానుభావులను, విద్యావంతులను, వివేకవంతులను, వాళ్ల మంచి మాటలు వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు ఉండరు.
సేకరణ – V V S Prasad
ఒక గౌరవప్రదమైన మహిళ అదృశ్యమైపోతే, ఒక నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడు అంతరించిపోతే, మార్గదర్శకులు, ఆదర పురుషులు కనుమరుగై పోతే “యువతకు విలువలు నేర్పేది ఎవరు????”