చెడుని కూడా నచ్చే విధంగా మాట్లాడటం నేర్చుకోవాలి – Telugu Short Stories
ఒక రోజు రాజుగారు గాఢనిద్రలో తన పళ్ళన్నీ ఊడిపోయినట్లు కలగన్నాడు, ఇటువంటి కల రావడానికి కారణమేమిటని నిపుణులను పిలిపించి తన కలలకు అర్థం ఏమిటని అడిగాడు. వారిద్దరిలో ఒక నిపుణుడు, “రాజకుటుంబీకులందరూ మీతో సహా త్వరలోనే చనిపోతారు”
రాజు కోపోద్రిక్తుడై ఆ నిపుణుడిని భటులచేత బాగా కొట్టించి చెరసాలలో పడేయించాడు, రెండో నిపుణుడు “మీ కలలకు అర్థం మీ రాజకుటుంబ సభ్యులకన్నా మీరు ఎక్కువ కాలం జీవిస్తారు” అని చెప్పాడు. అంటే రాజ కుటుంబ సభ్యులు ముందు చనిపోతారని, తరవాత మీ చావు ఎటూ తప్పదని కదా అర్థం! రాజుగారు సంతోషించి ఆ కలల విశ్లేషకుడికి బహుమతులు ఇచ్చి పంపాడు.
ఎదుటి వారికి నచ్చే విధంగా మాట్లాడి, సరైన పద్ధతిలో పనిచేసి, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అపాయాలనుండి తప్పించుకోవచ్చు.
సేకరణ – V V S Prasad