ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక్కోసారి పెద్ద శత్రువు కన్నా ఒక చిన్న శత్రువే ప్రమాదకారి – Telugu Short Stories
ఒక కందిరీగ ఆనందంగా నిద్ర పోతుంటే, ఆ గుహలో ఉన్న సింహం గట్టిగా గాండ్రిస్తోంది. కందిరీగకు నిద్రాభంగం అయింది. కోపం వచ్చి సింహం ముక్కు మీద గట్టిగా కుట్టింది. సింహానికి చిరాకు పుట్టి, పంజా గట్టిగా విసురుతూ కందిరీగను నలిపేయాలని చూసింది.
అది దాని పంజాకు దొరక్కుండా అటూఇటూ తిరుగుతూ సింహాన్ని మరింత విసిగించింది. మృగరాజు సింహాన్ని ఏడిపించానన్న ఆనందంతో జుయ్ మంటూ గుహ లోపల అంతా ఎగిరింది. దురదృష్టవశాత్తు దాని దారిలో ఒక సాలీడు గూడు ఉంది, ఆ వలలో చిక్కుకొనింది. ఆకలితో ఉన్న సాలె పురుగు కందిరీగను లటుక్కున కరుచుకుని ఆ దెబ్బకు మాయం చేసింది.
నిజమైన పెద్ద శత్రువు కన్నా, ఒక్కోసారి ఒక చిన్న శత్రువు ప్రమాదకారిగా పరిణమిస్తుంది… ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేందుకు తగిన అస్త్రశస్త్రాలతో సిద్ధం ఉండం, మన దగ్గర దానిని రూపుమాపే ఆయుధాలు కూడా ఉండవు.
సేకరణ – V V S Prasad