ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎదుటి వారి కథ మనకు తెలీదు – Telugu Short Stories
ఒకప్పుడు ఒక పక్షి క్షేమంగా గుడ్లు పెట్టుకోవడానికి తిరుగుతూ, రెండు చెట్లను చూసి వాటి దగ్గరకి వెళ్ళి అడిగింది, “నాకూ, నా గుడ్లకు రక్షణ ఇస్తారా మీరెవరైనా!” అని అడిగింది. మొదటి చెట్టు ‘నో! నేనివ్వలేను’ అనింది. రెండో చెట్టు ‘సరే’ అని ఒప్పుకుంది.
రెండో చెట్టును తన ఇల్లు చేసుకుని, గూడు కట్టుకుని గుడ్లను పెట్టుకుంది. ఈ లోపల వర్షాకాలం వచ్చింది. ఒక రోజు పెద్ద వాన పడింది. మొదటి చెట్టు కూలిపోయి వరదలో కొట్టుకు పోసాగింది. ఆ పక్షి చూసి, వెటకారంగా, “ఆ రోజు నాకు రక్షణ ఇవ్వలేదు, ఈ రోజు నీ ఖర్మ చూడు, ఎలా కాలిందో”
అనింది.
నీళ్లల్లో కొట్టుకు పోతున్న చెట్టు, “నాకు తెలుసు ఈ వర్షాకాలాన్ని దాటి బ్రతకలేనని, అందుకే కాదన్నాను. “నిజం తెలుసుకుని పక్షి బాధపడి, ఆ చెట్టు మీద గౌరవం పెంచుకుంది.
ఎవరైనా ‘లేదు’, ‘కాదు’, ‘నో అని చెప్తే అది పొగరుబోతుతనం అనుకోకూడదు. వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించడం మన ధర్మం. మనం మన సమస్యల్లో ఎంతగా కూరుకుపోయి ఉంటామంటే, ఇతరుల మనసుల్లోని భావాలను అర్థం చేసుకొనే ప్రయత్నం కూడా చేయలేనంతగా! వాళ్ళెందుకు ‘నో’ అన్నారో, దాని వెనక ఏం ఉందో అర్థం చేసుకోకుండా కోపతాపాలను ప్రదర్శిస్తాం. ఇతరులు చెప్పే ‘నో కు అకారణంగా ప్రతిస్పందించ కూడదు. ఎందుకు ‘వద్ద’న్నారో అన్నదాని వెనక ఉన్న మంచేదో అర్థం చేసుకోలేం, ఎందుకంటే వాళ్ళ కథ మనకు తెలీదు కాబట్టి.
సేకరణ – V V S Prasad