ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Best Stories in Telugu, Telugu Short Stories
నేను వీధిలో సైకిల్ తొక్కుతూ పోతుంటే, కొంచెం దూరంలో నా ముందు మరొకరు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నారు. అతన్ని అధిగమించాలనే కోరికతో వేగం పెంచాను. ఉత్సాహంగా తొక్కుతూ దగ్గరికి వచ్చాను. మరింత వేగం పెంచి అతన్ని దాటిపోయాను.
గోల్డు మెడల్ సాధించినంత ఆనందం వేసింది. అతనిపై గెలిచానని ఆనందంగా ఉంటే అతనిలో ఏ చలనమూ లేదు. ఈ ఆనందంలో నేను తీసుకోవలసిన మలుపు దాటి చాలా దూరం వచ్చేసానని నాలుక కరుచుకుని, వెనక్కు తిప్పుకుని, నా దారి వెదుక్కుంటూ వెనక్కు వెళ్లాను.
మన నిత్యజీవితంలో జరిగేది ఇదే కదా!! మన పొరుగువాళ్లు, తోటివాళ్ళు, స్నేహితులు, బంధువులను మించిపోయి, వాళ్ళ కంటే నేనే సమర్థుడిని అని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నమే కదా ఇది!! మనం వాళ్ళ వెంటబడి వాళ్ళను దాటిపోవాలని అనుకుని, మనమే దారి తప్పుతున్నామేమో !!
అనారోగ్యకరమైన ఇటువంటి పోటీలు ఎప్పటికీ అంతం కావు. ప్రతిస్థాయిలోనూ ఎవరో ఒకరు మనకంటే ముందుంటారు. ఒకరు మనకన్నా మంచి ఉద్యోగంలో ఉండొచ్చు. మరికొందరికి మంచి కారు, మంచి ఇల్లు, ఎక్కువ డబ్బు, అందమైన భార్య/భర్త ఉండొచ్చు. చదువుల్లో ముందంజలో ఉండొచ్చు.
జీవితం మీకిచ్చిన అందం, పర్సనాలిటీ, ఎత్తు వంటివాటితో తృప్తి పడండి. ఉన్న దానితో గర్వంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఏకాగ్రతతో పని చేయండి. మన గమ్యానికి పోటీ లేదు. మీ పరుగు మీదే. మీరెక్కడికి వెళ్లినా మీ ఉత్సాహాన్ని, కాంతిని మీతో తీసుకెళ్లండి.
సేకరణ – V V S Prasad