ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
స్వీయ పరీక్ష – Telugu Short Stories
కొన్నేళ్ల క్రితం ఒక షాప్ లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ నుండి ఓ యువకుడు ఫోన్ చేసి, “అమ్మా! నాకు మీ తోటమాలి ఉద్యోగం ఇస్తారా !” అని అడిగాడు. ఈ సంభాషణ ఎందుకో ఆ షాపు యజమానిని ఆకర్షించి, ఉత్సుకతతో వింటున్నాడు.
ఫోన్ లో ఒక స్త్రీ : మా ఇంట్లో ఒక తోటమాలి ఉన్నాడు.
యువకుడు: అమ్మా ! అతనికిచ్చే జీతంలో నాకు సగమిచ్చినా చాలు. నన్ను పనిలో పెట్టుకోండమ్మా !” బ్రతిమాలాడు.
ఫోన్ లో స్త్రీ: నా దగ్గర పని చేస్తున్న వ్యక్తి బాగా చేస్తాడు.
యువకుడు: మీ ఇంటి చుట్టూ ఉన్న నడిచే రహదారిని శుభ్రం అద్దంలా మెరిసేట్లు చేస్తాను. చెత్త చెదారం అంతా తీసేస్తాను.
స్త్రీ: ఒద్దు ! మా తోటమాలి చాలు.
చిరునవ్వుతో ఆ యువకుడు ఫోన్ కట్ చేసాడు. షాపు యజమాని యువకుడి సంభాషణ అంతా విని, ” నీ వైఖరి, దృక్పథం నాకు బాగా నచ్చాయి. నీకు నేను ఉద్యోగం ఇస్తాను, చెయ్యి.” అన్నాడు.
యువకుడు, ” థాంక్స్ ! ఒద్దండీ !
షాపు యజమాని : పని కోసం బ్రతిమాలుతున్నావు కదా !”
యువకుడు: లేదు సార్ ! ఆమె నా యజమాని, నేను తోటమాలిగా పనిచేస్తున్న ఆ చోట నా పనితనాన్ని అంచనా వేసుకోవడానికే ఆమెకు ఫోన్ చేసాను.”
సేకరణ – V V S Prasad