భయపడుతున్నా
విషాణువుని చూసి కాదు
మనిషి నిర్లక్ష్యపు వైకిరి చూసి
భయపడుతున్నా
అవగాహన లేని వానిని చూసి
ఆజ్ఞని లెక్క చెయ్యని అజ్ఞానిని చూసి
భయపడుతున్నా
బాధ్యతా రహిత ప్రవర్తన చూసి
విపత్తుకి ఎదురెళ్తున్న మూర్ఖుణ్ణి చూసి
భయపడుతున్నా
అంధకారం అలుముకుంటున్న ప్రపంచాన్ని
చూడలేని వాడి అందత్వ తత్వాన్ని చూసి