Menu Close

Telugu Poetry

Telugu Poetry

అక్కడ ఆమె,

నేలనలికిన మన్నులా
వన్నెలొలికే మిన్నులా
అందాల హరివిల్లులా
వసంతం వడి వడిగా చేరుకుంటోంది

వేయి వర్ణాల ఆ వయ్యారి
సుమవనాన్ని కమ్మని ఆమె మేని
సుగంధాల అలికిడిలోకి కొట్టుకుపోతోంది

women art

చల్లని చిరుగాలి ఆమె చక్కదనాన్ని
రెక్కల్లో పొదువుకునే పనిలో పిల్ల తెమ్మెరల పల్లకి పైన పక్షులు తరలొస్తున్నాయి

ఆమె పవిత్రతని కూడా తనలో కలుపుకుని
ఓ భగవద్గీత శ్లోకం మరింత పదిలమవుతోంది

లేత మొలకని మించిన ఆమె మెత్తని సోయగానికి
ఓ చిన్నారి లేగదూడ మైమరచిపోతోంది

ఆ కనురెప్పల కింద దాగిన వింత పూల కథలు వింటూ
కలువ బాలల మధ్య కబుర్ల కలవరం రేగుతోంది
ఇంకేమవుతుందో మరి ఈ సమస్త చరాచరం
పచ్చదన్నాన్ని కట్టుకున్న ఈ చక్కని పట్టు కొమ్మ ,
కనురెప్పల విల్లెత్తి ఓ చూపు బాణాన్ని విసిరితే
పగడాల పెదవులతో ఓ నవ్వు మెరుపును రువ్వితే!

అవును మరి,
ఆమె ఓ బంగారు గుండె లోంచి రాలిపడిన కమ్మని చెమ్మ
అవును మరి, ఆమె ఒక బాపూ బొమ్మ !!!

Telugu Poetry

Like and Share
+1
0
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading