ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎందుకో ఈ మద్య విమాన ప్రమాదాలు గురుంచి తరుచుగా వింటున్నాం, బహుశా ఆకాశ మార్గంలో రాద్ధీ పెరగడం వల్ల అయ్యి వుండొచ్చు. కానీ ఈ సారి ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లన.
సముద్రంలో కూలిన విమానం.. ప్రయాణికులు, సిబ్బంది గల్లంతు, ఇందులో మొత్తం 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న రష్యాకు చెందిన విమానం ఇవాళ సముదంలో కుప్పకూలింది.. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా గల్లంతయ్యారు.. పెట్రోపవలోస్క్ నుంచి పలనాకు మొత్తం 28 మందితో బయల్దేరిన ఏఎన్-26 విమానాకి పలానా ఎయిర్‌పోర్ట్‌కు పదికిలోమీటర్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇంకా కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందని అంతా భావిస్తున్న సమయంలో..
దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు. సముద్రంలో విమానం కూలిపోయిన ప్రాంతానికి నౌకలు వెళ్తున్నాయని.. అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.. ప్రయాణీకులలో గ్రామ మేయర్ ఓల్గా మొఖిరేవా కూడా ఉన్నారని చెబుతున్నారు..
విమాన ప్రయాణాలలో చిన్న పొరపాటు కూడా పెద్ధ మూల్యాన్ని కోరుతుంది. పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా అవసరం.