Telugu Moral Stories for Kids
“స్వర్గసుఖాలనుభవించడానికి” ఒక ధనవంతుడు మరణశయ్య మీద ఉంటూ, తనతో పాటు కొంత ధనాన్ని తీసుకెళ్లాలని అనుకున్నాడు. తను నమ్మిన ముగ్గురు వ్యక్తులను (లాయరు, డాక్టరు, ఇంజినీర్) పిలిచి, “మీ ముగ్గురికి తలా మూడు లక్షల రూపాయల చొప్పున ఇస్తాను. ఆ డబ్బును దయచేసి నా శవపేటికలో ఉంచండి.
మరణించిన తర్వాత ఆ డబ్బును నేను తీసుకెళ్తాను.” అని కోరుకున్నాడు. సరేనని ముగ్గురు ఆ డబ్బు తీసుకున్నారు. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆయన శవపేటిక స్మశానానికి వచ్చింది. ఆయన నమ్మిన ముగ్గురూ మూడు కవర్లు శవపేటికలో పెట్టారు.
అంతిమ సంస్కారాల తర్వాత ముగ్గురు ఒకే కారులో వెళ్ళిపోతూ ఇలా అనుకున్నారు. ఇంజినీర్ , “మీకు ఒక విషయం చెప్పాలి. మన ఊరి బడి అధ్వాన్నస్థితిలో ఉంది. దానికోసం లక్ష తీసుకొని మిగిలిన రెండు లక్షల కవర్ పేటికలో పెట్టాను.” అన్నాడు.
డాక్టర్ గారు అన్నారు, “ఒక వ్యక్తికి అసాధారణమైన జబ్బు ఉంది. దాన్ని నయం చేయడానికి ఒక మిషన్ కొనాలి. దానికోసం రెండు లక్షలు ఉంచుకొని లక్ష రూపాయల కవర్ ను శవపేటికలో పెట్టాను.”
చివరిగా లాయర్ అన్నడు,” ఛీ.. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది. నేను పూర్తిగా మూడు లక్షల రూపాయలకు చెక్ రాసి శవపేటికలో పెట్టాను.
సేకరణ – V V S Prasad.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
Telugu Moral Stories for Kids