ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
Telugu Moral Stories – కొత్త స్కూల్ లో జాయిన్ అయ్యా. స్కూల్ వాతావరణం పర్లేదనిపించింది. స్కూల్ కు కాంపౌండ్ వాల్ లేదు. అప్పుడే కొన్ని మొక్కల్ని నాటాము. టీచర్లం అందరం కలిసి రోజు స్కూల్ కు వెళ్ళగానే ఖాళీ సమయం లో ఆ చెట్ల పని చేసేవాళ్లం. ఆ చెట్లు కొంచెం పొడవు పెరిగినా మా అందరికి సంతోషం గా అనిపించేది. ఒక రోజు ఉదయం స్కూల్ కు వెళ్ళేసరికి స్కూల్ చుట్టూ మేకలు నాటిన చెట్లలో చాలావరకు చిగుర్లు తినేసాయి చాలా బాధనిపించింది.
ఎవరివా ఈ మేకలు అంటూ చుట్టూ చూసాను దూరంగా రామలక్ష్మి ఆమె వయసు 50 లోపు ఉంటాయి నోటి నిండా తాంబూలం తో ఒక వైపు ఆ నమలగా మిగిలిన తాంబూలంను ఉసుకుంటూ అరుస్తూ వస్తోంది. “ఏందక్కా ఇది ఇలా మేకల్ని వదిలేస్తే ఎలా చూడు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకున్నట్టు ఈ చెట్లు పెంచుకుంటున్నాం. మొత్తం మేకలు తినేసాయి” అన్నాను..
రామలక్ష్మి విసురుగా మేకల్ని తోలుకుని నిర్లక్ష్యంగా నన్ను చూస్తూ వెళ్లిపోయింది, నాకు చాలా బాధగా అనిపించింది. అరె వీళ్ళ ఊరిలోని పాఠశాల ను బాగుపర్చడం లో సహాయం చేయక పోగా ఈ నిర్లక్ష్యం ఏంటి అనుకున్నాను. ప్రతిరోజు పాఠశాల కు వెళ్తూ ఆ ఊరి పరిస్థితుల్ని కూడా అంచనా వేసే ప్రయత్నం చేసేదాన్ని ఎవరైనా తల్లిదండ్రులు పాఠశాలకు వస్తే టీచర్లము అందరం చక్కగా వారితో మాట్లాడేవాళ్ళం.
అలా రెండు సంవత్సరాల్లో ఆ పల్లె ప్రజలకు మా పాఠశాలతో మంచి అనుబంధం ఏర్పడింది. అలా నాకు రామలక్ష్మి కూతురు రజిత పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. రామలక్ష్మికి కొడుకు కూడా ఉన్నాడు. సురేష్అ, తని వయసు 18 సంవత్సరాలు రజిత కంటే చిన్నవాడు. డిగ్రీ చదివేవాడు.
రజిత అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మా పాఠశాల దగ్గరికొచ్చేది.మాటల్లోతన గురించి చెప్పింది..”నాకు 16 సంవత్సరాలకే మా అమ్మ పెళ్లి చేసిందమ్మా. అతనిది పెద్ద కుటుంబం. 9 ఎకరాల చేను. తోట ఉన్నాయి. చేసుకున్నప్పటి నుంచి గొడ్డు చాకిరి. ఎప్పుడు చేను పనులు. పొలం పనులతో తీరిక ఉండేది కాదు. పైగా, అతడికి అనుమానం గొడ్డు ను కొట్టినట్టు కొట్టేవాడు. తాగుడు ఒకటి నరకం చూసాను. పోయిన సంవత్సరం చనిపోదాం అనుకున్నాను. మా అమ్మ వాళ్ళు భయపడి పిల్చుకొచ్చేశారు. ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటున్నా అంది.
అంతలోనే రామలక్ష్మి పిలవడంతో వెళ్ళిపోయింది ఇక ఆ రోజంతా ఆ రజిత ఆలోచనలే చూడచక్కని పిల్లచామనచాయసన్నగా నాజూగ్గా ఉంది ఇంత చిన్న వయసుకు చాలా కష్టాలు చూసింది. తర్వాత రామలక్ష్మి ని చూసినపుడు చాలా గౌరవం కలిగాయి నాలో. పెళ్లి చేసి అత్తారింటికి పంపాక. బరువు దిగిపోయింది అని ఆలోచించే తల్లితండ్రులు కూడా ఉన్నారు ఈ కాలంలో నేను చాలా మందిని చూసా మాటల్లో రామలక్ష్మి ని ఆమె కూతురి గురించి అడిగా ఏమనుకుందో ఏమో. “సూడు మేడం. నీ పని చూసుకో, మా పల్లె యవ్వారం నీకెందుకమ్మ. పాఠాలు చెప్పుకుని పో తల్లీ “అంది.
నాకు బాధగా అనిపించింది సరేలే ఈమె మాములే కదా అనుకున్నాను రజితను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎప్పుడు మొదటి భర్తతో గొడవలు పోలీస్ స్టేషన్ చుట్టుతిరగడం.”ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతోంది అనిపించింది. ఒక రోజు రామలక్ష్మీస్కూల్ దగ్గరకు వచ్చింది. దగ్గరకు పిలిచి ఒక విషయం చెప్పాను.”అక్కా. రజిత ది చిన్న వయసు .ఇప్పుడే చాలా కష్టాలు పడింది.విడాకులు అయిపోయాయి కదా. నువ్ ఏమి అనుకోకుండా.ఇంకో పెళ్లి చేయచ్చుగా .ఆ పిల్ల కు “అన్నాను.అంతే.”ఏమ్మో చూస్తున్నా అట్లా మా ఇండ్లల్లో కుదరదు. దాని తమ్ముడు అలా రజిత కు రెండో పెళ్లి చేస్తాం అన్నందుకు కొడవలితో నా వెంట పడ్డాడు. వాడికి పరువు పోతుందంట”అంది.
సమస్య ఆమె కొడుకే.రెండు నెలల తరువాత.సురేష్ మా స్కూల్ లోకొచ్చాడు. స్టడీ సర్టిఫికెట్ కోసం.సురేష్ తో “మీ రజిత వయసు తక్కువ.విడాకులు అయిపోయాయి. మీ ఇంట్లో నే ఉంటోంది. నీకు పెళ్లయ్యాక మీ అక్క మీ ఇంట్లోనే ఉంటే గొడవలు రావచ్చు. అందుకే. ఒక పెళ్లి జరిగి నష్టపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు గా. మీ అక్క కుకూడా జీవితం లో భర్త అనే తోడు ఉండాలి కదా.ఆలోచించు సురేష్”అన్నాను.”నా ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు మేడం. నన్ను హేళన చేస్తారు”అన్నాడు.”అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఏమి లేకపోతే ఏమి మీ కుటుంబం సంతోషంగా ఉండడం ముఖ్యం.
ఆలోచించుకో”అన్నాను.ఈ విషయం మర్చిపోయాను. వేసవి సెలవులొచ్చాయి.వేసవి సెలవులు తర్వాత స్కూల్ పనుల్లో బిజీ అయిపోయాను. ఒకరోజు రామలక్ష్మి వచ్చి రెండు అరటి పళ్ళు చేతిలో పెట్టి.”మేడం. నా కూతుర్ని మా అన్న కొడుక్కిచ్చి పెళ్లి చేసాను. ఏప్రిల్ చివర్లో జరిగింది. చెప్పడానికి కుదరలేదు. నా కూతురికి ఇప్పుడు రెండో నెల.కడుపుతో ఉంది. నా అల్లుడు చాలా బాగా చూసుకుంటాడు.”అంది ఎంతో సంతోషంగా, నాక్కూడా చాలా సంతోషం అనిపించింది.
ఆడపిల్ల భర్త ను వదిలేసి వస్తే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అంటగట్టేవాళ్ళు ఎవరితో మాట్లాడిన తప్పే అనేవాళ్ళు కొందరు ఈ సమాజం లో మన చుట్టూ ఉంటారు.ఆడవాళ్లు ఇంకో పెళ్లి చేసుకున్నారంటే సుఖం కోసం కాదు. సమాజం లో తోడు కోసం. ఒంటరిగా బతకలేక.అయిన ఒంటరి స్త్రీ ఈ సమాజం లో బతకడం కొంత వరకు కష్టం. ఒంటరి స్త్రీ ల పై వేధింపులు ఉండకూడదు. ప్రతి స్త్రీ ని మన ఇంటి స్త్రీ గా గౌరవించాలి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Telugu Moral Stories
Inspiring Telugu Stories
Motivational Stories
Pitta Kathalu, Neethi Kathalu
Moral Stories in Telugu