Telugu Moral Stories
వీధిలో తాపీగా నడిచి పోతున్న పిల్లికి సింహంలాంటి కుక్క ఎదురు పడింది.
పిల్లి పారిపోవాలని చూసింది కానీ అంతకంటే వేగంగా కుక్క వెంటబడి పట్టుకొంది.
పిల్లి విడిచిపెట్టమని బ్రతిమాలింది. కుక్క ఊహూ.. ఒప్పుకోలేదు.
లాభం లేదని పిల్లి కుక్కతో ఒక బేరం కుదుర్చుకుంది, “నన్ను ఒదిలి పెడితే దొరికిన ఆహారమంతా నీకు తెచ్చిచ్చి మిగిలినదే నేను తింటాను.” అని. కుక్కకు ఈ ఒప్పందం నచ్చి, “ఏమాత్రం తేడా వచ్చినా చంపేస్తా!!” అని బెదిరించింది.
పిల్లి రోజూ ఆహారం తెచ్చి పెట్టేది, కుక్కకు నిజాయితీగా ! అలా కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజు పిల్లి ఎంతకీ రాలేదు. కుక్క పిల్లిని వెతుక్కుంటూ పోతే, అదొక ఎలుకను భోంచేస్తూ కనబడింది. కుక్క కోపంతో, ” నీవు మాట తప్పావ్. నిన్ను ఇప్పుడే చంపి తినేస్తా.” అంటూ పిల్లి మీదికి దూకింది.
పిల్లి భయపడి తప్పించుకొని పరుగు తీసింది. కుక్క వెంబడించింది. రోజూ ఏ కష్టం లేకుండా దొరికిన తిండితో కుక్క బాగా బలిసింది. పిల్లి వేగాన్ని అందుకోలేక పోయింది. అలా పిల్లి, దాని వెనక కుక్క పరిగెత్తుతూ, ఒక కొండ పై అంచుకు చేరాయి.
పిల్లికి కొండమీది నుండి అవతలికి దూకి బ్రతికి పోవడమో, కుక్క నోటబడి చావడమో అన్న పరిస్థితి ఏర్పడింది. ఏమైతే అదైందని పిల్లి ఒక్క దూకు దూకి ప్రాణం రక్షించుకుంది. రోజూ పొట్ట పగిలేలా తెగతిని బలిసిన కుక్క పరిగెత్తే వేగం కోల్పో యి కొండ అంచునుంచి పడి చచ్చిపోయింది.
నీవు చేసుకోవలసిన స్వంత పనులను ఎవరి దయాదాక్షిణ్యాలకో ఒదిలి పెట్టవద్దు, మొదట్లో చాలా ఆనందంగానే ఉంటుంది. కానీ చివరకు ప్రాణాంతక మౌతుంది.
Telugu Moral Stories
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.