అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఒక అడవిలో గుంపుగా కొన్ని కప్పలు పోతున్నాయి. వాటిలో రెండు కప్పలు అకస్మాత్తుగా ఒక గుంటలో పడిపోయ్యా యి. మిగిలిన కప్పలు ఆ గుంట లోతు చూసి “మీరింక పైకి రాలేరు, పైకి రాలేరుగా… చచ్చి పోవడానికి సిద్ధంగా ఉండండి.” అంటూ హేళనగా బెకబెకలాడాయి.
అయితే ఆ రెండు కప్పలు పైకి రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. “అబ్బే…. మీరు పైకి రాలేరు… రాలేరుగాక రాలేరు…” పెద్దగా అరుస్తూనే ఉన్నాయి. ఒక కప్ప నిజమే అనుకొని తన ప్రయత్నాన్ని విరమించి గుంటలో పడి చావుకు సిద్ధమై పోయింది.
రెండో కప్ప పైనున్న కప్పలు చేసే బెకబెకలను లక్ష్యం చేయకుండా పైపైకి ఎగబాకుతూ పైకి చేరుకొంది విజయవంతంగా. “మేం ఇంతగా నువ్వు ఎక్కలేవని అరుస్తున్నా పైకి ఎలా వచ్చావ్..”అన్నాయి కప్పలన్నీ ఆశ్చర్యంగా. “నాకు చెవుడు… మీరు చెప్పింది ఏమీ వినబడలేదు. నన్ను ప్రోత్సహిస్తున్నారని అనుకున్నాను.” అంది.

నిజంగా మీ జీవిత లక్ష్యాన్ని సాధించాలన్న బలమైన కోరిక ఉంటే, మిమ్మల్ని నిరుత్సాహపరిచే నెగెటివ్ ఆలోచనలను కట్టిపెట్టండి.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
అతి పెద్ద కవితా ప్రపంచం – https://kavithalu.in/