ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక రైతుకి తన పొలంలో మట్టిలో కూరుకుని ఉన్న ఒక పెద్ద బండరాయి అడ్డంకిగా మారింది. పొలం దున్నేటప్పుడు, అడ్డంగా ఉన్న ఆ పెద్ద బండరాయి వల్ల ఎన్నోసార్లు, పనిముట్లు విరిగిపోయాయి. ఆ రాయి కాలికి తగిలి రైతుకు గాయాలు అయ్యేవి. లోతుగా పాతుకుపోయిన కొండంత బండరాయిని తొలగించడం అసాధ్యం అనుకున్నాడు.
ఆరోజు కూడా ఆ రాయిని తట్టుకొని కింద పడ్డాడు. దాంతో నాగలి కూడా విరిగిపోయింది. కోపం వచ్చి ఏ విధంగానైనా, భూమి నుండి దాన్ని పీకి పారేయాలని నలుగురు స్నేహితుల్ని పిలిచి, “ఈ బండ చూడండి. పొలం దున్నడానికి అడ్డంగా ఉంది. మీరు తలా ఒక చెయ్యి వేస్తే ఈ బండను తొలగించ వచ్చు.” అని రైతు బండరాయి చుట్టూ గడ్డపారతో మట్టిలో నాలుగు దెబ్బలు వేసి పెళ్ళగించాడు.
దెబ్బకు బండ రాయి కదిలి వెలుపలికి వచ్చింది. అతని స్నేహితులు చూసి నవ్వారు. “ఏదో పెద్ద కొండను కదిలించాలి, రమ్మని పిలిచావు. ఇదేనా!! అయినా నీ ఒక్కడివే కదిలించ గలిగావు కదా!” ఇంతకాలం దాన్ని ఒక పెద్ద కొండ అని భ్రమ పడ్డాను. ఈరోజు తానొక్కడే పెళ్ళగించ గలిగాడు. దీన్ని ఇంత పెద్ద సమస్యగా ఊహించినందుకు బాధ పడ్డాడు.
ఆ రైతు లాగానే, మన జీవితాలలో కూడా చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా కనిపిస్తాయి. వాటిని బూచిలా చూస్తూ, పరిష్కరించుకునేందుకు భయపడతాం. అందుకే సకాలంలో, సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవాలి. పోరాటం మొదలు పెడితే సమస్యలు చిన్నవైపోయి, జీవితంలో ముందుకు సాగుతాం.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Telugu Moral Stories