ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
పెన్సిల్: నన్ను క్షమించు ప్లీజ్!!
ఎరేజర్/ రబ్బర్: ఎందుకూ!! నీవు ఏ తప్పు చేయలేదు కదా!!
పె: నేను చేసే తప్పులకు నీకు శిక్ష పడుతోంది. నా తప్పులను నీవు చెరిపేస్తూ అరిగిపోతూ అంతరించిపోతున్నావ్.
ఎ: నిజమే! నాకేం బాధ లేదు. నేను ఉన్నదే దానికోసం. తప్పు జరిగిన ప్రతిసారి నీకు సహాయం చేయడానికే ఉన్నాను. ఒక రోజు నేను పూర్తిగా అరిగిపోతాను. నీవు కొత్త ఎరేజర్ కొనుక్కుంటావ్. నేను చేస్తున్న పని నాకు ఆనందంగానే ఉంది. నీవేం బాధపడొద్దు. నీవు నా కోసం బాధ పడడం నాకు నచ్చదు.
ఈ పెన్సిల్, ఎరేజర్ ల సంభాషణ స్ఫూర్తిదాయకంగా ఉంది. తల్లిదండ్రులు ఎరేజర్ లాంటివాళ్ళు. పిల్లలు పెన్సిళ్ళలాంటి వాళ్ళు. తల్లిదండ్రులు నిరంతరం పిల్లలతో ఉండి, వాళ్ళ తప్పులు దిద్దుతూ, జీవితకాలమంతా పిల్లల అభివృద్ధికి తోడ్పడుతూ, అరిగిపోయి చిన్నగా అయిపోతారు. చివరికి అంతరించిపోతారు. కొంతకాలానికి పిల్లలు కొత్త తోడు ( భార్య/భర్త) తెచ్చుకుంటారు. అయినా తల్లిదండ్రులు సంతోషిస్తారు. పిల్లలు బాధల్లోనూ, కష్టాల్లోనూ ఉండడం వాళ్లకి ఇష్టం ఉండదు. జీవితకాలం అంతా నేను పెన్సిల్ లాగానే ఉన్నాను. ఎరేజర్ ను చూస్తే,( రోజు రోజుకీ వృద్ధులైపోతున్న తల్లిదండ్రులు) జాలిగా ఉంటుంది.
సేకరణ – V V S Prasad