ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఓ ఊళ్ళో ఓ ధనవంతుడుండేవాడు. అయితే మహా కోపిష్టి, ఏ చెడు ఎదురైనా ఊరుకొనేవాడు కాడు. చెడామడా తిట్టేవారు. ఇంకా ఎక్కువ కోపం వస్తే కొట్టడానికి కూడా వెనకాడేవాడు కాదు. అతనికో మంచి సేవకుడు ఉండేవాడు. అతడంటే ధనవంతుడికీ ఇష్టమే. అందుకే బాగా చూసుకొనేవాడు. ధనవంతుడు ఒక రోజు దోసకాయ తింటుంటే అది చేదుగా అనిపించింది, సేవకుడిని పిలిచి కోపంతో దోసకాయను మొహాన విసిరేసి తినమన్నాడు.
సేవకుడు మారుమాట్లాడకుండా ఆనందంగా కసకసా కొరికి తినేసాడు. ధనవంతుడు ఆశ్చర్యంగా, “అదేమిటి, అంత చేదుగా ఉన్నదాన్ని అంత ఆనందంగా ఎలా తిన్నావ్?” “స్వామీ! మీరు నా యజమాని. ప్రతిరోజూ రుచికరమైన ఆహారం పెడుతున్నారు. ఒక్క రోజు రుచిలేని, లేదా చేదుగా ఉన్న కాయ ఇస్తే తినడానికి ఎందుకు బాధ ??”
ఇది విన్న ధనవంతుడికి తన ఆలోచనల్లో లోపమేమిటో బోధ పడింది. ప్రకృతి ఇంత ఆనందం, ఐశ్వర్యం ఇస్తే, ఒక చిన్న చేదు దోసకాయకు ఇంత రాద్ధాంతం చెయ్యాలా!!
ఏది జరిగినా అంతా ప్రకృతి సహజంగానే జరుగుతుంది. జీవితంలో ఎదుర్కొనే మంచిచెడులను ఆనందంగా స్వీకరిస్తే, – జీవితం సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది పూలనావలా.
సేకరణ – VVS Prasad]