Menu Close

Telugu Moral Stories – అపారమైన ప్రేమాభిమానాల కలిగిన దేవతలు కూతుళ్ళు


Telugu Moral Stories – అపారమైన ప్రేమాభిమానాల కలిగిన దేవతలు కూతుళ్ళు

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ఒక గర్భిణీ స్త్రీ భర్తను అడిగింది: మీకెవరు కావాలి? అబ్బాయా ? అమ్మాయా ??
భర్త : అబ్బాయైతే వాడికి గణితం, క్రీడల వంటివి నేర్పిస్తాను.
భార్య: అమ్మాయైతే !!

భర్త : నేను ఆ అమ్మాయికి ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు ఆ అమ్మాయే అన్నీ మళ్ళీ నాకు నేర్పిస్తుంది….
ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా తినాలి వంటివెన్నో… నిజానికి ఆ అమ్మాయి నాకు రెండో అమ్మ అవుతుంది.
నేనే ప్రత్యేకమైన గొప్ప పనులు చెయ్యక పోయినా నన్ను ఒక గొప్ప హీరోలా చూస్తుంది.
నేను ఆమెతో విభేదించినపుడు, నన్ను అర్ధం చేసుకుంటుంది.
ఆ అమ్మాయి ఎంత పెద్దదైనా, తనను నేను ఒక బుజ్జి పాపలా చూడాలని అనుకొంటుంది.
నాకోసం ప్రపంచాన్నే ఎదిరిస్తుంది. నన్నెవరైనా బాధిస్తే, వాళ్ళనెప్పటికీ క్షమించదు.

భార్య: అయితే మీ కూతురు ప్రేమించినంతగా మీ కొడుకు ప్రేమించడన్న మాట.
భర్త: కాదు, కాదు… అబ్బాయైనా అదే చేస్తాడేమో !! అయితే అవన్నీ వాడు నేర్చుకోవాలి.
కానీ కూతుళ్ళకు పుట్టుకతోనే అవన్నీ అబ్బి ఉంటాయి. ఒక కూతురికి తండ్రిగా ఉండడం గర్వించాల్సిన విషయం.

భార్య: అమ్మాయైతే ఎప్పటికీ మన దగ్గర ఉండదు కదా!!
భర్త: కానీ ఆమె హృదయంలో మనం శాశ్వతంగా ఉంటాం.
కాబట్టి అమ్మాయి ఎక్కడికి పోయినా పెద్ద తేడా ఉండదు.

అపారమైన ప్రేమాభిమానాల కలిగిన దేవతలు కూతుళ్ళు.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading