ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories – ఈ ఐశ్వర్యం, గుక్కెడు నీళ్లు, ముద్ద అన్నం పెట్టలేక పోయాయి
ఒక కౄరమైన రాజు ప్రజలను పీడించి, అక్రమంగా బొక్కసం నింపుకొనేవాడు. ఆ అక్రమ సంపాదనంతా, అడవిలో రహస్యంగా ఒక గుహలో దాచి ప్రత్యేకమైన తాళం వేసేవాడు. దాన్ని తీయడం రాజుకు, మంత్రికి మాత్రమే తెలుసు. ఒక రోజు, రాజు ఒక్కడే తన అక్రమసంపాదనైన ఐశ్వర్యాన్ని దాచిన గుహకు వెళ్లి చూసి మురిసిపోయాడు.
అదే సమయంలో మంత్రి కూడా అటువైపు వచ్చి గుహ తలుపు తీసి ఉండడం చూసి ఖంగు తిని. భయంతో పరుగున పోయి తాళం వేసి ఊపిరి పీల్చుకున్నాడు. లోపల రాజు తన ఐశ్వర్యాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు, గుహ బయటి నుండి తాళం వేసారని గమనించకుండా ! కొంత సేపు ఆ మణులూమాణిక్యాలు చూసి మురిసిపోయి గుహ తలుపు వైపు నడిచాడు.
తలుపులు మూసి ఉంటే తీయడానికి ప్రయత్నించాడు, అవి రాలేదు. తలుపులు దబదబా బాదాడు. భయంతో ‘తలుపు తీయండి’ పెద్దగా అరిచాడు. హు…ఎవ్వరికీ వినిపించలేదు అతని ఘోష! ఆ ధనరాశులను వేడుకున్నాడు, ‘గొంతు తడుపుకోడానికి ఇన్ని నీళ్లు, తినడానికి ఇంత తిండిని ఇవ్వమ’ని. ఏడ్చాడు, తలబాదుకున్నాడు.
ఆ అపారమైన ధనం అతని ఆకలిని, దాహాన్ని తీర్చలేక పోయింది. వేలికి గాయం చేసుకుని, గోడమీద రక్తంతో సందేశం రాసాడు. ఈ లోపల సైన్యం, కుటుంబ సభ్యులు దేశమంతా వెదికారు. ఆయన మంత్రి గుహ తలుపులు తీసి లోపలికి వచ్చాడు. రాజు చచ్చిపడి ఉన్నాడు. పురుగులు, ఈగలు ముసిరి ఉన్నాయి. గోడమీద, “ఈ ఐశ్వర్యం, గుక్కెడు నీళ్లు, ముద్ద అన్నం పెట్టలేక పోయాయి.”
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories