Menu Close

Telugu Moral Stories – మూడు బొమ్మల కథ


Telugu Moral Stories – మూడు బొమ్మల కథ

ఓ యువరాజుకు ఓ సాధువు మూడు బొమ్మలు ఇచ్చాడు. “నేను చిన్న పిల్లవాడినా! నాకెందుకు?” అన్నాడు యువరాజు. “ఇవి కాబోయే మహారాజుకు ఇచ్చే కానుకలు. ప్రతి బొమ్మ చెవిలోనూ ఒక రంధ్రం కనిపిస్తుంది. ఈ దారం తీసుకుని ఒక్కొక్క బొమ్మ చెవిలో పెట్టండి. మీకే తెలుస్తుంది.”

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

మొదటి బొమ్మ చెవిలో దారం దూర్చాడు. అది రెండో చెవి నుండి బయటకి వచ్చింది. “ఈ వ్యక్తికి ఏం చెప్పినా రెండో చెవి నుండి బయటికి వస్తుంది. ఈ వ్యక్తి దేన్నీ సీరియస్ గా తీసుకోడు” అన్నాడు సాధువు. ‘యువరాజు రెండో బొమ్మ చెవిలో దారం దూర్చాడు, దారం నోటి నుండి బయటకు వచ్చింది” ఇతను ఏం విన్నా అందరికీ చెప్పేస్తాడు”.

ఈ సారి మూడో బొమ్మ చెవిలోకి దారాన్ని దూర్చాడు. అది బయటికి రాలేదు. “ఇతను అనవసరంగా మాట్లాడడు. అతనిలోనే దాచుకుంటాడు”, “వీళ్ళల్లో ఎవరు ఉత్తములు” రాకుమారుడు అడిగాడు.

సాధువు నాలుగో బొమ్మ ఇచ్చాడు. యువరాజు దాని చెవిలో దారం దూర్చాడు. అది రెండో చెవి నుండి బయటికి వచ్చింది. మరోసారి దారం దూర్చాడు, ఈ సారి నోటి నుండి బయటకు వచ్చింది. మూడో సారి దారం దూర్చితే అసలు బయటికి రాలేదు. ఈ తరహా వ్యక్తులు ఉత్తములు. ఎప్పుడు వినకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలి. ఈ మూడూ తెలిసినవాళ్ళు ఉత్తములు అత్యంత విశ్వాసపాత్రులు.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading