Menu Close

Telugu Moral Stories – అజ్ఞానం కేకలు వేస్తుంటే, తెలివి మౌనంగా ఉంటుంది.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Moral Stories

అడవిలో ఒక గాడిద పులి ఎదురు పడ్డాయి, అప్పుడు గాడిద పులితో “గడ్డి నీలంగా ఉంది కదా!!” అనింది, పులి “కాదు!కాదు! ఆకుపచ్చగా ఉంది” ఇలా కాసేపు గాడిద గడ్డి నీలంగా ఉందని, పులి ఆకుపచ్చగా ఉందని వాదులాడుకున్నాయి, లాభం లేదని రాజైన సింహం దగ్గరికి వెళ్లాయి, నిజానిజాలు తెలుసుకోవడానికి.

“నిజమే, గాడిద చెప్పిందే కరెక్ట్. గడ్డి నీలంగా ఉంటుంది” “ఈ పులి పిచ్చిది రాజా! ఆకుపచ్చగా ఉందని నా బుర్ర తినింది. ఈ పులిని శిక్షించండి” పులికి ఐదు సంవత్సరాల పాటు మౌనంగా ఉండాలని, కఠినమైన శిక్ష విధించింది సింహం “హేయ్… గడ్డి నీలంగా ఉంటుంది, గడ్డి నీలంగా ఉంటుంది” అంటూ ఓండ్ర పెడుతూ ఆనందంగా పరుగులు తీసింది గాడిద.

పులి దీనంగా, “రాజా!! గడ్డి ఆకుపచ్చే కదా! నాకెందుకీ శిక్ష ? అని అడిగింది” దానికి సింహం “నిజమే! గడ్డి ఆకుపచ్చే! నీ శిక్షకు, గడ్డి రంగుకు సంబంధం
లేదు. ఈ శిక్ష నీలాంటివాల్లు నిజానిజాలు తెలుసుకోలేని మూర్ఖులతోనూ, మొండివాళ్లతోనూ వాదించి మరో సారి కాలాన్ని వృధా చెయ్యకూడదని.

lion

నిజానిజాలు తెలుసుకోలేని మూర్ఖులతోనూ, మొండివాళ్లతోనూ వాదించడం కాలాన్ని వృధా చేసుకోవడమే. వాళ్లకు గెలుపే ముఖ్యం. ఏమాత్రం అర్థం లేని వాదనలు వద్దు. కొందరు అన్ని ఋజువులు చూపినా, అర్థం చేసుకోరు. ఇంకొందరు అహం, పొగరు, ద్వేషాలతో కళ్ళు మూసుకుపోయి ఉంటారు. వాళ్లకు కావాలి ప్రతిచోటా గెలుపు,వాళ్లది తప్పైనా ! అజ్ఞానం కేకలు వేస్తుంటే, తెలివి మౌనంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం శారీరిక, మానసిక ఆరోగ్యానికి మంచిది.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading