Menu Close

అనుకరించడం వల్ల కలిగే ప్రయోజనం – Telugu Moral Stories

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

అనుకరించడం వల్ల కలిగే ప్రయోజనం – Telugu Moral Stories

గురువంటే అపారమైన గౌరవం, అభిమానం, ఆరాధన ఉన్న శిష్యుడొకడు గురువు చేసే ప్రతి పనిని, క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆయనలాగా మారితే గురువుగారికి ఉన్నంత గౌరవం, వివేకం, జ్ఞానం, పేరు ప్రఖ్యాతులు వస్తాయని అనుకొన్నాడు.

గురువు తెల్లటి వస్త్రాలనే తొడుక్కుంటాడని, శిష్యుడు కూడా ధవళ వస్త్రాలను తొడుక్కోవడం ప్రారంభించాడు. గురువు శాఖాహారం మాత్రమే తీసుకునేవాడు. శిష్యుడు కూడా శాఖాహారానికి మారిపోయాడు. గురువులాగే, శిష్యుడు కూడా చాప మీద పడుకోవడం అలవాటు చేసుకున్నాడు.

monk

శిష్యునిలో వస్తున్న మార్పు చూసి ‘ఎందుకీ మార్పు’ అని అడిగాడు. “నేను మీ అంతటి వాడిని కావాలనీ !! నా తెల్ల బట్టలు నన్ను నిరాడంబరత వైపు తీసుకెళ్తాయి. శాఖాహారం నా దేహాన్ని పరిశుభ్ర పరుస్తోంది. సుఖాలను వదిలిన తర్వాత ఆధ్యాత్మిక చింతన పెరిగింది” అన్నాడు.

గురువుగారు చిరునవ్వుతో శిష్యుడిని దగ్గరలోని మైదానంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక గుర్రం గడ్డి మేస్తూ కనబడింది. శిష్యుడితో, “నీ సమయాన్ని నన్ను అనుకరిస్తూ వృధాగా గడుపుతున్నావ్. నీలోకి నువ్వు చూచుకోవడం లేదు. ఆ గుర్రాన్ని చూడు! దానికి తెల్ల తోలు ఉంది. గడ్డి మాత్రమే తింటుంది. గుర్రాలశాలలో గడ్డి మీద నిద్రపోతుంది. నీవు ఆ జంతువు కూడా సాధువులానే ఉందనుకుంటున్నావా!! ఏదో ఒక రోజు అది కూడా గురువుగా మారుతుందని
అనుకుంటున్నావా!

అనుకరించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. సృజనాత్మక ఆలోచనలతో జీవితాన్ని పరిపుష్టం చేసుకోవాలి.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading