ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మన తప్పిదాలే మనకు భయాన్ని కలిగిస్తాయి – Telugu Moral Stories
బాగా బలిసిన ఓ మంత్రి వర్యులు గారికి హఠాత్తు గా గుండె నోప్పి వచ్చింది, ఆపరేషన్ కోసం అమెరికా కు తీసుకెళ్లారు
ఆసుపత్రిలో డాక్టర్లు మంత్రి గారికి విజయవంతం గా శస్త్రచికిత్స చేసారు,
మంత్రి గారు కోలుకున్నాక డాక్టర్ గారు వచ్చి మంత్రి గారిని పలకరించారు..
ఎలా ఉన్నారు మంత్రి గారు? ఇప్పుడేం ఛాతీ లో నోప్పి లాంటిది ఏం లేదుకదా?
అందుకు మంత్రి గారు భలే వారే డాక్టర్ గారు, అమెరికా లో అందులో తమంతటి వారు స్వయానా ఆపరేషన్ చేసాక ఇంకెందుకు వస్తుందండి ఆ నోప్పి.. అదే మా ఇండియా లో ఐతే ఈపాటికి టపా కట్టేసే వాన్ని, ఎంతైనా అమెరికా, అమెరికానేనండి మా ఇండియా లో గుండెకు ఆపరేషన్ అంటే లివర్ కు చేసేవారు, అమెరికా కాబట్టి బతికి బట్ట కట్టగలిగాను, మా ఇండియా డాక్టర్ లు శుద్ధ వేస్ట్ అండీ.. అంటూ ఇంకా ఏదో చెప్పబోయారుఇక చాలు ఆపండి మీ సోది, అంటూ డాక్టర్ గారు విసురు గా లేచారు, ఆయన కళ్ళు చింతనిప్పుల వలె ఎర్రబడ్డాయి.
ఆపరేషన్ అయ్యింది కదా, దయచేసి ఇక వెళ్ళి పోండి, ఇంకోక్క మాట మీరు ఇండియా గురించి చెడుగా మాట్లాడితే సహించేది లేదు అని మంత్రి గారి మెుహం కూడా చూడకుండా వెళ్ళి పోయారు.. బిక్కచచ్చిన మెుహంతో మంత్రి గారు ప్రక్కనున్న అసిస్టెంట్ డాక్టర్ గారితో ఎవరు ఈయన ?ఎందుకలా నా మీద సీరియస్ అయ్యారు? అని అడిగారు
అందుకు ఆ అసిస్టెంట్ డాక్టర్ మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ విల్సన్ గారు ఆయనే.. ఆయన డాక్టర్ కోర్సు మీ ఇండియా లోనే చేసారు అని చెప్పాడు..
మంత్రి గారికి డాక్టర్ గారు ఎందుకలా మండిపడ్డాడో అర్ధమైంది.. డిస్చార్జ్ అవబోతూ ఆ డాక్టర్ గారితో నన్ను క్షమించండి డాక్టర్ గారు, ఏదో మాట తూలాను, మనసులో పెట్టుకోబాకండి అన్నారు,
అందుకు డాక్టర్ విల్సన్ గారు ఛ. ఛ. అలాంటిదేమి లేదండి.. ఇండియా గురించి తక్కువ చేసి ఓ ఇండియనే అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను, నేను ఇండియా లోనే డాక్టర్ కోర్సు పూర్తి చేసాను, నాకంటే మేధావులు మీ ఇండియా లో సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక మరుగున పడుతున్నారు, మీ రాజకీయాలు,కుల వివక్ష, రిజర్వేషన్ లతో కోంతమంది మేధావులు అక్కడ ఇమడ లేక ఇలా విదేశాలకు వలస వస్తున్నారు, వారి మేధాశక్తి కి ఇక్కడి వారు నెత్తినపెట్టుకున్నారు, అంత ఎందుకండీ ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన ఈ హాస్పిటల్ చీఫ్ మీ భారతీయుడే తెలుసా?
ప్రజల సొమ్ము తో ఆపరేషన్ చేయుంచుకునేందుకు వచ్చిన మీరు ఆ ప్రజలనే తిడుతుంటే చూస్తూ ఉండలేక పోయాను, ఇకపోతే మీకు జరిగిన ఆపరేషన్ ను మీ ఇండియా లో డాక్టర్ కోర్స్ చదివే ఓ పీ జీ స్టూడెంట్ చూయింగ్ గమ్ నమిలినంత ఈజీగా చేయగలడు, కానీ మీరు చేయించుకోరు, ఎందుకంటే వారు డాక్టర్ కోర్స్ చదివారో, లేదో? లేక మీరు వేలంపాట పెట్టి అమ్మిన డాక్టర్ సీటును డబ్బు పెట్టి కోన్నవాడేమో అని మీ డౌట్?!
అందుకే రిజర్వేషన్ లేని,ప్రతిభకే పట్టం కట్టే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు మీ భారతీయులు,
కష్టం మీ వాళ్ళది, పేరు మాత్రం మా దేశాలది,
నేడుఅభివృద్ధి చెందిన పెద్ద, పెద్ద దేశాలు కానీయండి, కంపెనీలు కానీయండి వారి అభివృద్ధి వెనక ఖచ్చితంగా మీ భారతీయుల కృషి ఉందనేది ముమ్మాటికీ నిజం.. మీరు వాడుకోలేరు, మేము వాడుకుంటున్నాం..టాప్ అంతా మాదగ్గర ఉంది, స్క్రాప్ మాత్రం మీ దగ్గర ఉంది.
తన దేశాన్ని తప్పు పట్టిన వాడు రేపు తన కన్న తల్లిని కూడ తప్పు పడతాడు..
మీకు ఇంతకంటే నేను చెప్పలేను..
సెలవ్.. గెట్ వెల్ సూన్..
మంత్రి గారికి నోరు పెగల్లేదు..
డాక్టర్ గారు అన్న చివరి మాటలు
“గెట్ వెల్ సూన్” అన్నది
తన శరీరానికా? తన మనసు కా?
భారతీయుడా/రాలా ! నీ దేశం బాగు కోసం…….ఏదైనా చేయాలనుకుంటే చిత్తశుద్ధితో నిర్మాణాత్మక కృషి చేయండి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children