Menu Close

ఏమిటో ఇది వివరించలేనిది-Telugu Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువు ఆగనన్నది
భాషలేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే బాషా అయినది
కోరుకొని కోరికేదో తీరుతున్నది
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువు ఆగనన్నది

అలలా నా మనసు తేలుతుందే…
వలలో నువ్వు నన్ను అల్లుతుంటే
కలలా చేజారి పోకముందే
శిలలా సమయాన్ని నిలపమందే…
నడక మరిచి నీ అడుగు ఒడిన నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఎదో సాగుతున్నది ఓ…
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగనన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో…
కలిపే ఒక కొత్త నిన్ను నాతో
నేనే ఉన్నంత వరకు నీతో నిన్నే చిరునవ్వు విడువదనుకో…
చినుకు పిలుపు విని నెమలి ఫించమున రంగులెగిసినట్టు
వలపు పిలుపు విని చిలిపి మనసు చిందేసే ఆగనంటు
కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓ...
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువు ఆగనన్నది

Song Details:

Movie: Rangde
Song: Emito Idhi
Singer: Kapil Kapilan, Hari Priya
Lyrics: Shreemani
Music: Devi Sri Prasad
Music Label: Aditya Music.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading