Menu Close

నా కనులు ఎపుడు కననే కననీ – Telugu Lyrics


నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా
చేదుపై తీపిలా రేయి పై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా

ఎపుడు లేని ఈ సంతోషాన్ని దాచాలంటే
మది చాలో లేదో
ఎపుడు రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ
సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న

నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథేంతో నీ గతంలో
నా కథంతే ఓ క్షణం పెంచినా
గుప్పెడు గుండెకు పండగ ఆ వేళా
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా

Song Details:

Movie: Rang De
Song: Naa Kanulu Yepudu
Lyrics: Shreemani
Music: Devi Sri Prasad
Singer: Sid Sriram
Music Label: Aditya Music

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading