ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Love Stories – రొమాంటిక్ లవ్ స్టోరీ
వారం రోజుల్నుంచి ఇంట్లో ఎదో జరుగుతుంది. అర్థం కావడం లేదు కాంతానికి. మీ కోడలు మా గడుసుది, ఇంత విషయం కూడా బయటకి పొక్కనివ్వకుండా నా కొడుక్కి నాకు మధ్య గోడ కట్టేసింది. అంతలోనే పిలిచింది బయటనుంచి, అత్తయ్య గారు ఒకసారి బయటకు వస్తారా కోడలు పిలుస్తోంది.. వస్తా, ఉండండి అంటూ గంతులేసుకుంటూ వెళ్ళిపోయింది.
అందుకే ఆడవాళ్ళ విషయంలో తలదూర్చకూడదు అంటూ, పేపర్ లోకి తలదూర్చేరు కాంతం భర్త. అవునా! ఇంత అర్జంట్ గా యాత్రకా అదీ ఊరుకాని ఊర్లో రోనా రోజుల్లో గుడికి అదీ అంత దూరం, ఎలాగ కుదురుతుందే చెయ్యి పిసుక్కుంటూ అంది కాంతం. ఇపుడు తప్పదంటావా? కొడుకుని అడిగింది.
తప్పదు, మన మంచికేనేమో. అంత బట్టలు సర్దుకొండి అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారు ఝామునే కార్ లో బయలుదేరేరు అంతా.. ఓంకారేశ్వర దర్శనానికి నది దాటాలి. మాకు కొంచెం దూరం లో ఒక ఫామిలీ కూర్చుంది. మనవాళ్లే అనుకుంటా, పలకరించి వస్తా అంటూ వాళ్ళ దగ్గర కూర్చుండిపోయారు రామనాధం గారు. తాతయ్య ఎపుడూ ఇంతే, ఉన్నది ఐదుగురం కలిసి ఉండడం మానేసి, మీటింగ్ లకి వెళ్ళిపోతారు, తిట్టుకుంటూ వాళ్ళున్న వైపు తిరిగింది ఇందు.
అపుడు మొదలైంది, ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడు. ఎదో మాటల మధ్య సూపర్ అంటూ, చేతితో సైగ చేసి చూపిస్తున్నాడు. అదిరిపడింది ఇందు. మళ్ళీ ఇటు తిరిగి కూర్చుంది.. ఒరేయ్! కొంచెం ఇటు తిరిగి కూర్చో, ఎం పర్వాలేదు అంటున్నాడు. 2 నిమిషాలే ప్రయాణం వొడ్డుకు రావడంతో కుర్రాడు చెక్కబల్ల అబ్బాయి వదిలాడు.
అమ్మమ్మ ఆపసోపాలు పడితోంది దిగడానికి. నీవల్ల కాదులే అంటూ చెయ్యందించాడు. ఇంకో మనవడు. ఆ అబ్బాయి కూడా చెయ్యి ముందుకు చాచేడు, కానీ అంతలోనే అమ్మమ్మ my cute డార్లింగ్ అంటూ.. సిక్సర్ కొడుతున్నట్టు అమ్మమ్మ వీపు మీద నెమ్మదిగా చరిచేడు.. ఒక నవ్వు ఇందు వైపు కూడా వేసేడు.
మామయ్యా, గుడ్ షాట్ అంది ఒక చిన్న పాప. జాగ్రత్తగా దిగవే ఇందు.. బామ్మ చెయ్యి ఇవ్వబోయింది నేను దిగుతానులే.. నాకొచ్చు, అంటూ దిగబోతుంటే కాలు బల్ల మీద నుంచి తప్పుకుంది. జాగ్రత్త, నానమ్మ అతను రెండు మాటలు కలిసాయి. జాగ్రత్త , సరితక్కా.. రమ్మంటావా.. చెయ్యి ఊపుతున్నాడు. ఆమె వాళ్ళ వెనక్కాల ఉంది.
పువ్వులు, పళ్ళు బాగానే ఉన్నాయా. ఉంగరాలు పెట్టెలు జాగ్రత్తె అమ్మగారు అందర్నీ అలెర్ట్ చేస్తోంది. అబ్బా.. అమ్మ.. నువు దొంగలకు తాళాలివ్వక జాగ్రత్తగా దిగు.. ఇక్కడ ఎవరి సాల్తీలు వాల్ల చేతుల్లోనే ఉన్నాయి సరిత సమాధానం చెప్పింది. ఎంత పెద్ద కుటుంబమో, భలే సరదాగా ఉన్నారు కదండీ.. వాణీ తెగ సంతోషపడిపోయింది భర్త తో చెప్తూ.
అవునట అమ్మాయి, ఆ ముందు వెళ్తున్నాడు ఆ అబ్బాయి నిశ్చితార్థం అంట ఇవ్వాళ.. భలే పద్ధతైనోడు.. నాకు కాళ్ళకి దణ్ణం పెట్టాడు కూడా.. నిశ్చితార్థం అన్నమాట. వింది ఇందు. బావున్నాడు, సరదాగా ఉన్నాడు, అందరితో కలిసిపోతున్నాడు. ఎవరో అదృష్టవంతులు అనుకుంటుండగానే కళ్ళ నీళ్లు తిరిగినియి నాది అవ్వాల్సింది ఎవరో తీసుకుపోతున్నట్టు అనిపించింది.
మళ్ళీ నవ్వుకుంది ఏంటి ఇంత తొందరగా ప్రేమ పుట్టేస్తుందా లేక సినిమాలో చెప్పినట్టు అట్రాక్షనా మళ్ళీ నవ్వుకుంది. ప్రపంచంలో నవ్వే అబ్బాయి ఇతనొక్కడేనా, ఇంకెవరూ ఉండరా.. వాళ్లలో ఒకరు నాకు కాకుండాపోతారా.. అయినా సరే అనుకుని ఒకసారి ముందుకి చూసింది. అందుకోసమే అన్నట్టు చూస్తున్నాయి అతని కళ్ళు.. ఈ సారి భయం వేసింది. ఇందుకి.
ఈ సారి రెండు చేతులూ గాల్లో లేపి పువ్వులా చేసి చూపుడు వేలితో మళ్ళీ చెప్తా నీ సంగతి అన్నట్టు ఊపేడు. ఏంటీ!ఈ అబ్బాయి ఒకవైపు నిశ్చితార్థం మరోవైపు ఇలా వేషాలు వేస్తున్నాడు. అనుకుంది. మళ్ళీ అనుకుంది ఇదికూడా మంచిదే, వీడిలా పిచ్చివేషాలు వేస్తే ఎలాగు బాడ్ ఒపీనియన్ వస్తుంది. అప్పుడు ఎక్కడైనా ఇష్టం పెరిగితే దీనివల్ల పోతుంది. అమ్మయ్యా అనుకుని సంతోషపడింది.
ఈ సారి మళ్ళీ ముందుకు చూసింది. తనని చదివేస్తున్నాడు ఈ అబ్బాయి. అదేం కుదరదు చెప్తా నీ సంగతి అంటూ గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇటు వైపే చూస్తూ.. శంకర్గాదా మైక్ టెస్టింగ్ లా ఉంది మా సీక్అనుకుంది. ఇందు, ఇంతలో గుడి వచ్చేసింది. ఇంక కలవం కదా. అని చూసింది ముందుకు.. సీ యు సూన్.. ఫోన్ లో అంటున్నట్టు ఈ సారి తాను వెనక్కి చూసేడు.. చూద్దాంలే అనుకుంది.
ఈ లోపు పేరయ్య కనిపించేడు బామ్మకి.. పిలవబోతుంటే మాకూడా వచ్చినవాళ్ళ కేసి వెళ్ళిపోయాడు. ఆరి భడవా అంది పేరయ్యని. అతను మా వేపు చూసి ఎదో చెప్తుండగానే అబ్బాయి నాన్నగారు మాకేసి వస్తున్నారు. క్షమించాలి బావగారు.. కరోనా కి ఎవరూ చుట్టాలు రారు. ఇంకా ఇళ్లలో చేసుకుంటే ఎం బావుంటుంది. అదేదో గుడిలో అయితే అంతా మంచే జరుగుతుంది పేరయ్యకి ఈ ఉపాయం చెప్పేం. మీరు ఎం శ్రమపడలేదుగా? మీరంటున్నది.. అర్థం కాలేదు రామనాధానికి.
మీరు కూడా వృత్తి రీత్యా ఇక్కడ ఉంటున్నారని తెలిసింది. ఇక్కడే ఉన్న సంబంధం దొరికింది ఈ మాయదారి రోగం వదులుతుందో లేదో ఊళ్ళోకి వెళ్లి సంబంధం మాట్లాడుకుని ఈ తంతు అంతా అయ్యేట్టుగా లేదని, పేరయ్యగారిని అడిగితే మీ గురించి చెప్పి, ఇక్కడ అందర్నీ కలుపుతాను. మిమ్మల్ని కంగారు పెట్టకుండా నిశ్చితార్థ సరంజామా మమ్మల్నే తెచ్చుకోమని ఆర్డర్ వేసేరు పేరయ్య. తప్పుతుందా చెప్పండి చెయ్యివ్వండి బావగారు అంటుచేయ్యి చాపి, మళ్ళీ అమ్మో నమస్తే అంటూ చేతులు జోడించాడు.
దేవుడు ఏమైనా ఇవ్వదలిస్తే దరిద్రం తీరిపోయేలా ఇస్తాడు అంటారు నిజమే అనిపించింది రామనాధం మనసుకి. ఇందు జరుగుతున్నది నమ్మలేకపోతుంది. మొదటిసారి చూసినవాడే, అదీ నచ్చినవాడే భర్త అయిపోవడం ఈ రోజుల్లో జరిగే పనేనా, ఆశ్చర్యపోతుంది.. రా వదినా.. అక్కడ చీర మార్చుకోవడానికి రూమ్ ఉందట, లాక్కెళ్లిపోయింది అబ్బాయి అక్క.
అత్తా, సూపర్ గా రెడి అయి రావాలి. మామయ్యా కోతిలా ఉండాలి.. తెలిసిందా.. అంది సరిత కూతురు.. చేతులు కట్టుకు తనవైపు చూస్తున్నాడు. తొందరగా రెడి అవ్వమని సైగలతోనే చెప్పేడు. కాంతమ్మ హడావుడి మొదలైంది. అసలే అంతా మగ పెళ్లి వాళ్లే చేసుకున్నారు. రేపొద్దున్న మాట రాకుండా కొంచెం హడావుడి అన్నా మనం చేద్దాం. అయిన ఎమన్నా చేద్దామన్న ఏముంది. నాకెమన్నా ఎపుడైనా చెప్పావటే నువ్వు కోడల్ని పట్టుకుని ఏడ్చేసింది సంతోషంతో..
మంచివాళ్ళకి మంచే జరుగుతుంది ఎపుడు అంటూ అటు చేరిపోయాడు కాంతమ్మ భర్త.. బంగారపు బొమ్మలా నడిచివస్తుంది ఇందు. ఈసారి చూడక్కర్లేదు ధైర్యంగా మాట్లాడొచ్చు. అన్నాడు. కొన్ని క్షణాలు క్రితం నేను కావలనుకున్నది నిలువెత్తు ప్రేమ గా.. ఎంత దూరం నుంచి ఇంత రొమాంటిక్ గా నా దగ్గరికి వచ్చిందో.. కలలా ఉంది, నేను అనుకున్నది అలా కళ్ళముందు జరిగిపోవడం చెప్పేస్తోంది, ఇందు. కాదేమో అనుకున్నది ఎదురైతే అంతేనేమో మరి. ఆమె మాటలకి అడ్డుపడ్డాడు పేరయ్య. అమ్మా!మీటింగ్ లు, డేటింగ్ లు తరువాత పెట్టుకోండి.. ముందు ఉంగరాలు మార్చుకోండి అంటూ.. ఈ సారి ఆ కళ్ళు సైగలు చెయ్యలేదు. కానీ ఆ చేతులు కొత్త బంధం ఏర్పాటుకు ఓంప్రదంగా ఉంగరాన్ని తొడుగుతున్నాయి..
Telugu Love Stories – రొమాంటిక్ లవ్ స్టోరీ, Telugu Prema Kathalu, Love Stories in Telugu, ప్రేమ కథలు
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com