ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Funny Stories
ఒక స్త్రీ షాపింగ్ పూర్తి చేసుకొని, బయటికి వస్తే, అనుకోని ఊరేగింపు ఒకటి కనిపించింది. ఒక శవపేటిక దాని వెనక 50 అడుగుల దూరంలో ఇంకొక శవపేటిక, వాటి వెనక ఒక మహిళ, తన కుక్కతో నడుస్తోంది. వెనక ఒక 200 మంది లైన్లో నడుస్తున్న యువతులు. షాపింగ్ చేసి వస్తున్న స్త్రీ కుతూహలం పట్టలేక, కుక్కతో శవపేటికల వెనక నడుస్తున్న స్త్రీని పలకరించింది.
“మీకు జరిగిన నష్టం చూసి బాధగా ఉంది, ఆందోళనలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు, అయినా మొదటి శవపేటికలో ఎవరూ?” “నా భర్త” ” ఏం జరిగింది!!” ‘ ” నా మీద గట్టిగా కేకలేసాడు, నా కుక్క అతని మీద పడి చంపేసింది.” ‘ ” అయితే, ఈ రెండో పేటిక ఎవరిది!!” ‘ ” మా అత్తగారిది, ఆమె కొడుకును రక్షించుకోబోతే ఆమె మీద పడి నా కుక్క చంపేసింది.
కొద్ది సేపు నిశ్శబ్దం.
మీ కుక్కను కొద్ది రోజులు అద్దెకిస్తారా ! “భర్త, అత్తగారిని పోగొట్టుకున్న స్త్రీ, “అయితే వెనక లైన్ లో నిలబడండి.”
సేకరణ – V V S Prasad