Menu Close

అద్బుతమైన కథ – ఈ ప్రపంచం గుర్తింపు కోసం పరుగులెడుతుంది.. మన పని మనం చేస్తే గుర్తింపు అదే వస్తుంది.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఆ కధ అర్థం మన ప్రవర్తన మనం ఏంటి అనిఎదుటి మనిషికి తెలియజేస్తుంది.

మన ప్రవర్తనే మనకి మంచి చెడు గుర్తింపు తెచ్చి పెడుతుంది మనం ఏంటి అనేది అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ గుర్తింపు కోసం మనుషులు నాన్న అడ్డదారులు తొక్కుతున్నారు తమకు తాము దూరమై జీవిస్తున్నారు. నిజమే గుర్తింపు అనేది ఇంటా బయట అందరూ కావాలి అనుకుంటాం కచ్చితంగా కోరుకుంటాం. కానీ కొందరు ఆలోచనలో ఆచరణలో పొరబడుతున్నారు.

వారికి చెప్పేదేంటంటే గుర్తింపు మన రూపం వలన మన దగ్గర ఉన్న డబ్బులతో రాదు, ఒకవేళ అలా వచ్చిన గుర్తింపు కలకాలం ఉండదు. మన ప్రవర్తన మనం చేసే పనుల వలన వస్తుంది చూశారా ఆ గుర్తింపు అసలైన గుర్తింపు ఆ గుర్తింపు కలకాలం ఉంటుంది. గుర్తింపు కోసం ఏదేదో చేసి ఆయాసపడే పని లేదు సరైన దారిలో వెళ్తే రావలసిన గుర్తింపు అదే వస్తుంది రాకపోయినా వచ్చే నష్టమేమీ లేదు ఆనందం అయితే తప్పక వస్తుంది.

అసలు అందరూ గుర్తించాలని ఆరాటమెందుకు అసలోడు ఆ తండ్రి పరమాత్మ గుర్తిస్తే చాలదా చెప్పండి. మన ప్రవర్తన మనమేంటో తెలియచేసే ఒక కధ చెబుతా చదవండి.

ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు. రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు. అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.

రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు – “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది. దీనిని ఆవు పాలు పోసి పెంచామని చెప్పాడు. రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.

రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది. అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు. అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు… అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.

అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము అని రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని.

అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది. ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు….రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడుకొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు. ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు. రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.

రాజుకు చాలా కోపం వచ్చింది. కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు. తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు. మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని. రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు. ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు.

ఫ్రెండ్స్ మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే! మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే అని అర్థం అయింది కదా.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading