ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నిద్రలేమి సమస్యకు చక్కని చిట్కాలు..
How to Get Better Sleep Lifestyle..?
☛ పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ తేనె వేసుకుని తాగాలి. తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో హాయిగా నిద్ర పడుతుంది.
☛ రాత్రి సమయాల్లో ల్యాప్‌టాప్‌లు, టీవీలు, మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చూడడం తగ్గిస్తే మంచిది.
☛ రాత్రి సమయంలో అరటి పండు తీసుకుంటే మంచిది. ఇందులో అధికండా మెగ్నీషియం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
☛ మెగ్నీషియం అధికంగా ఉండే బాదం తినడం వల్ల కూడా హాయిగా నిద్రపడుతుంది. నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో బాదం ఎంతగానో సాయపడుతుంది.
☛ నిద్రించడానికి ముందు మెలటోనిన్ సమృద్ధిగా ఉండే చెర్రీ పండ్లను తినడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్‌లా తాగినా చక్కని ఫలితం ఉంటుంది.
☛ పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగాలి. ఈ పాల మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది.
☛ చేపలు, బీన్స్‌లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
☛ కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫ్యాట్‌లెస్‌ని పెరుగుని తీసుకోవడం వల్ల సుఖ నిద్ర మీ సొంతం అవుతుంది.
☛ ఇనుము శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. సమస్య ఎక్కువగా ఉన్న వారు రెండు రోజులకు ఓసారి ఆకుకూరలని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
☛ రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల హ్యాపీగా నిద్ర పోవచ్చు.
☛ నిద్రకు ముందు కాఫీ, టీలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల నిద్రభంగం కలగొచ్చు.
☛ కొంతమంది నిద్రపట్టడం లేదని ఆల్కహాల్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల అన్ని మరిచిపోయి నిద్రపోవచ్చని భావిస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు.
☛ స్లీపింగ్ పిల్స్ వాడడం కూడా అంత మంచిది కాదు. అది తాత్కాలిక పరిష్కారమే తప్పా.. శాశ్వత పరిష్కారం కాదు.
☛ నిద్రకు ముందు జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, మసాలా ఐటెమ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు.. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురై నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి.
☛ శ్వాససంబంధమైన వ్యాయామం చేయండి. ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది.
☛ రాత్రి పూట భోజనానికి, నిద్రకు కనీసం గంట, గంటన్నర సమయం వ్యవధి ఉండాలి.
☛ రూమ్ కూడా తక్కువ వెలుగులో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ప్రకాశవంతమైన లైట్స్ కాకుండా.. బెడ్ లైట్స్ వేసుకోవాలి. దీని వల్ల మంచి నిద్ర మీ సొంతమవుతుంది.